Rao Bahadur: “రామప్ప” ను.. “రావు బహదూర్” గా మార్చిన సమాజం, కులం!

( సినిమా కొత్త ప్రయత్నం కాబట్టి… రివ్యూ కూడా కొంచెం కొత్తగా ఉండబోతోంది!)

సింపుల్ గా…

ప్రధాన పాత్ర అయిన, “రామప్ప” అలియాస్ “రావు బహదూర్” చేసిన వింత వికృత చేష్టలు మీ దరికి, దర్శకుడు వెంకటేష్ మహా.. అనుకున్నట్టు చేరాలి అంటే..

    మీ దగ్గర సమయం, పేషన్స్ తో పాటు.. మీ మెదడు ను.. రివ్యూయర్స్ చెప్పే అభిప్రాయాలు మర్చిపోయి.. సినిమాను ఓపెన్ మైండ్ తో చూసేలా సిద్ధం చెయ్యాలి.  ఆఫీసు నుంచి వచ్చి సినిమాకి వెళ్లొద్దు. మధ్యలోనే వచ్చేస్తారు. రోజంతా అలసిపోయి.. సెకండ్ షో చూడొద్దు.. నిద్ర పోతారు..ఇది తెలుగు సినిమా గొప్పతనం అని ఎవరో superlatives use చేశారని.. మీరు సొసైటల్ pressure కు లొంగి, ఎలాగైనా చూడాలి అని టికెట్ బుక్ చెయ్యొద్దు. నిరుత్సాహ పడుతారు.. కానీ… ఒక మూడు గంటలు.. మొబైల్ పక్కన పడేసి.. ఆఫీసు, కాలేజ్ గొడవలు మర్చిపోయి.. ఇదేదో కొత్త ప్రయత్నం అనుకుని, చూస్తే.. ఈ ప్రపంచం.. ఆ పాత్రలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాయి!

(Disclaimer ముందే ఇచ్చేసాను కాబట్టీ.. సినిమా ను రెండు విధాలుగా రాస్తాను.. )

  1. ఒక్కటి.. నాకు సినిమా నచ్చింది అనుకుంటే.. ఏమి నచ్చింది.
  2. రెండు.. నాకు సినిమా నచ్చలేదు అనిపిస్తే.. ఏమి నచ్చలేదు..

నాకు సినిమా నచ్చింది..

Christopher Nolan, ” Tenet” సినిమా విడుదల సమయంలో, ఒక్క మాట అన్నారు. ” Don’t try to understand. Feel it” (ఆ సినిమాలో, ఒక్క పాత్ర చేత ఆ డైలాగు చెప్పిస్తారు కూడా! ) “రావు బహదూర్ “దర్శకుడు వెంకటేష్ మహా , ఈ కాన్సెప్ట్ ను బాగా పట్టేసి, జనాలకి అర్థం కాకపోయినా పర్లేదు.. ఫీల్ అయితే చాలు అనట్టు.. ఒక స్టేజ్ డ్రామా సిద్ధం చేసి వదిలారు!

మొదటి సగమంతా.. సత్యదేవ్ పాత్ర చేసే.. వింత చేష్టలు తోనే సరిపోతుంది. ఈ సమయంలో , దర్శకుడు కి కలర్ గ్రేడింగ్, సెట్స్, మరియు VFX బాగా సహాయం చేశాయి. 

రావు బహదూర్ మంచం తిరగడం… అతని కళ్ళలో నుంచి ప్రపంచం ను చూపించడం.. తన పూర్వీకులు, బ్రెయిన్ వాష్ చెయ్యడం.. అనుమానం పెనుభూతం అంటూ.. సమాజం, కులం రెండు కలగలిపి.. ఒక్క ప్రధాన పాత్రదారి మానసిక స్థితి ను దిగజార్చడం లాంటి ఎన్నో hyperlinks చక్కగా కుదిరి…సినిమా మొదటి భాగం ను నిలబెట్టాయి. ఈ సమయం లో, ప్రేక్షకుడు ఫీల్ అయితే చాలు రావు బహదూర్ ను.. సన్నివేశాలు స్మూత్ గా , కదులుతాయి.

రెండవ సగం , ప్రేక్షకుడు.. రావు బహదూర్ ను ఫీల్ అవ్వకర్లేదు. ఆల్రెడీ, వీడి వికృత వింత చేష్టలు కు అలవాటు పడ్డాడు కాబట్టీ, సగటు ప్రేక్షకుడు సినిమాలో మెయిన్ థీమ్ వెతకడం మొదలు పెడతాడు. క్లైమాక్స్ లో చిక్కుముడి విప్పినా.. ఇదేదో తెల్సిన కథే కదా అనిపిస్తుంది ప్రేక్షకుడు కి. మొదటి సగం ఇచ్చిన వింత అనుభవం.. రెండో సగం ఇవ్వదు. ఇన్వెస్టర్స్ కోసమో, ప్రేక్షకుడు మీద జాలి కలిగిందో తెలీదు కానీ, దర్శకుడు వెంకటేష్.. సినిమాను సింపుల్గా ముగిస్తాడు.

ఇక ఇప్పుడు…

నాకు సినిమా నచ్చలేదు

సినిమా అనేది ఆటవిడుపు. కొంతమందికి కాలక్షేపం.. మరి కొంతమందికి వినోదం.. మహేష్ బాబు నిర్మాణం లో భాగం అయ్యారు అంటేనే.. సినిమాకి పెద్ద బలం. ఈ సినిమాకి అదే బలహీనత కూడా. ! రీచ్ ఎక్కువ రావడంతో, ప్రేక్షకుడు ఏదో ఊహించి వస్తే, దర్శకుడు మహా ఇంకేదో వడ్డించి పంపించాడు.

పాత్రధారి కి మానసిక స్థితి బాలేకపోతే, మొదటే డాక్టర్ ఆచారి.. psychiatrist ను అడిగి, రెండు మందులు మింగించి.. నాలుగు electric షాక్ లు ఇప్పిస్తే, బహుదూర్ గారు దారికి వచ్చేవారు. సినిమా కు లాజిక్ ఉండేది. నీరు అంటే భయం అంటూ.. “రేణుక” ఎదురుగా మొదటిసారి వింతగా ప్రవర్తించిన రామప్ప ను.. ఎవరైనా.. కౌన్సిలింగ్ ఇప్పించి… సలహా ఇస్తారు. లాజిక్ లేని, మ్యాజికల్ స్క్రీన్లే కోసం, climax దాకా.. యోగా నిద్ర అంటూ డిలే చెయ్యడు!

“When logic ends.. drama begins ” అనే లైన్ ను అందరూ ఒకేలా తీసుకోలేరు.

మరి.. నీకు సినిమా నచ్చిందా.. నచ్చలేదా.?

ప్రయత్నం బాగుంది. రామప్ప ను.. రావు బహదూర్ గా మార్చిన పరిస్థితులు.. కదిలించాయి. సత్యదేవ్ నటన ఆకట్టుకుంది. పిచ్చికి పరాకాష్ట అనట్టు.. సత్యదేవ్ పాత్ర మతి స్థిమితం లేని వ్యక్తి గా చేసిన చేష్టలు.. కొన్ని సార్లు మరి అబెట్టుగా.. ఒకసారి అయితే, పిచ్చి దర్శకుడు కు.. నటుడు కి కాదు అన్నట్టుగా ఉంటుంది.

దర్శకుడు వెంకటేష్ మహా తను.. పేపర్ మీద అనుకున్నది.. స్క్రీన్ మీదకి తీసుకొచ్చిన విధానం మాత్రం ఒక్క casestudy గా ఉండబోతోంది.. రానున్న రోజుల్లో! ఇంతలా ఆలోచించి, చిత్రీకరించడం సులభం కాదు.

నాకు సినిమా నచ్చింది అనుకుని.. 2.75/5 ఇస్తాను.. నాకు సినిమా నచ్చలేదు అనుకుంటూ.. 2.25/5 ఇస్తాను.

మరి.. రావు బహదూర్ గారు మీకు ఎలా అనిపించారో, కామెంట్ చెయ్యండి!

4.9/5 - (9 votes)

4 thoughts on “Rao Bahadur: “రామప్ప” ను.. “రావు బహదూర్” గా మార్చిన సమాజం, కులం!”

  1. Sai sir meeru nachaledhu antune 4.9 icharu. May be nikki mimmalni prabhavitham chesi vuntadu. Manodu, manodi producer ani.

    Reply

Leave a Comment