మా ఇంటి బంగారం: Climax లో రఫ్ ఆడించిన సమంత!

సింపుల్ గా…

యాక్షన్ వేణుమా? యాక్షన్ ఇరుక్కు.

ఫైట్స్ వేణుమా? ఫైట్స్ ఇరుక్కు..

Background score వేణుమా? మంచి BGM ఇరుక్కు.

మరి సినిమా? క్లైమాక్స్ పోర్షన్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. సమంత పాత్ర.. ఫైట్స్ చేస్తుంటే, ఎంజాయ్ చెయ్యని ప్రేక్షకుడు ఉండడు. మిగతా సినిమా అంతా, క్లైమాక్స్ కోసమే డ్రాగ్ చేసి చేసి… చివర్లో ఫుల్ మీల్స్ పెట్టే ప్రయత్నం చేశారు, నందిని రెడ్డి. అంత ఓపికగా క్లైమాక్స్ కోసం వేచి చూస్తే, పరవాలేదు అనిపిస్తుంది సినిమా. !

వివరంగా…

సమంత. పరిచయం అక్కర్లేని పేరు. యువత హృదయాలకు, ఏదో మాయ చేసి.. చాలా ఏళ్లుగా, GIRL NEXT DOOR పాత్రలకి చిరునామాగా , తెలుగు సినిమా తెరమీద మెరుస్తూఉంది. అలాంటి, సమంత ను ,  మా ఇంటి బంగారం ట్రైలర్ రాగానే.. ఈమె, యాక్షన్ ఏంటి? ఫైట్స్ ఏంటి? వార్నింగ్ ఇచ్చే డైలాగ్స్ ఏంటి? అనుకున్నారు అంతా. సినిమా మీద హైప్ పెంచింది కూడా ఆ ప్రమోషనల్ కంటెంట్ మాత్రమే!

సమంత పాత్ర పరిధి మేర, యాక్షన్ ఎపిసోడ్స్ బాగా రాసుకున్నారు. కానీ, సినిమా కథ విషయంలో, కొంచెం శ్రద్ధ లోపించింది. “అతడు” కథ ను.. ఒక ఫీమేల్ పాత్ర చేస్తే ఇలానే ఉంటుంది ఏమో. !

నాకు నచ్చిన విషయాలు..

సినిమా లో, నాకు బాగా నచ్చిన అంశాలు..

  1. సమంత ఫ్రెండ్ రోల్ చేసిన, ” మంజూష” . ఇన్నోసెంట్ గా ఉంటేనే, సమంత పాత్ర కు కావలసిన సహాయం, జనాలకి కావలసిన కామిక్ రిలీఫ్ అందించారు. “LETS COME ON” . రానున్న రోజుల్లో, ఈమె మరిన్ని మంచి పాత్రలు కి C/O అడ్రస్ గా ఉండనున్నారు.
  2. సంతోష్ నారాయణన్ Background score! Samantha పాత్ర ఫైట్స్ చేస్తుంది సరే. స్టోరీ మరీ పేలవంగా ఉన్నా, సంతోష్ నారాయణన్ తన టాలెంట్ తో, కొన్ని సీన్స్ కు మంచి బిల్డప్ ఇచ్చారు.
  3. గుల్షన్ Devaiah! విలన్ పాత్రలో, మెరవడం ఇతనికి కొత్తేమీ కాదు. కానీ, సినిమాలో.. అడవిలో ఉండి వచ్చిన మనిషికి కావలసిన క్రూరత్వం, అటవీ వ్యవహారశైలి వంటి ఎన్నో, చిన్న చిన్న nuances చక్కగా పలికించారు.
  4. సమంత.. చివర్లో రాస్తున్న అని కాదు. చివరి వరకు.. సినిమా చూడగలిగాను అంటే, సమంత వల్లనే! ఫైట్స్, డాన్స్, యాక్టింగ్… సమంత 2.0

ఇక.. చివరగా…

కథ పెద్దగా కొత్తగా లేకపోయినా , స్క్రీన్ ప్లే లోపం వల్లన, పాత్రలు నడిచిన తీరు…కొన్ని సార్లు చిరాకు తెప్పిస్తాయి.. ఎడిటర్ కు free hand ఇచ్చి ఉంటే, ఫస్ట్ హాఫ్ ఇంకాస్త క్రిస్పీగా ఉండేది!

క్లైమాక్స్ కోసమే, సినిమా అంతా సాగతీశారు, రచయిత దర్శకులు.. క్లైమాక్స్ లో, సమంత పాత్ర కు కావలసిన, బిల్డప్, ఎమోషన్స్, ఫైట్స్, యాక్షన్, మ్యూజిక్ లాంటి ఎలిమెంట్స్ తోడు అయ్యాయి కాబట్టి, ప్రేక్షకుడు తన రెండున్నర గంటల సమయం కోసం పెద్దగా ఆలోచించడు! అదే మొదటి సగం లో డైరెక్ట్ యాక్షన్, రెండో సగం లో, ఇంకొన్ని, హై ఇచ్చే పాయింట్స్ రాసుకుని ఉంటే, సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది. ప్రస్తుతానికి, పరవాలేదు అనుకోవడం తోనే సరిపోయింది.

I’m rating the movie with 2.5/5

మీరు సినిమా చూసేసి ఉంటే, మీకు ఎలా అనిపించిందో, కామెంట్ చెయ్యండి!

5/5 - (10 votes)

Leave a Comment