సింపుల్ గా….
పాత విషయాన్ని ఎన్ని సార్లు చెప్పినా, వినేవాడు ఉన్నంత కాలం బాగానే గడుస్తుంది. వినేవాడికి విషయం బోర్ కొట్టినప్పుడు, విషయంలో కొంచెం ” మసాలా ” కలిపి చెప్తే, విషయం పాతదే అయినా, ఇంకోసారి వినే ప్రయత్నం చేస్తాడు. “లెనిన్” సినిమాలో జరిగింది అదే. ట్విస్టలు ఊహించలేము, పాత్రలు స్వభావాలు మారుతూ ఉంటాయి. అంత మాత్రాన, ఇది గొప్ప సినిమా మంచి సినిమా అని కితాబు ఇవ్వలేము. “మసాలా” తగ్గించి, డ్రామా మీద దృష్టి పెట్టి ఉంటే బాగుండేది ఏమో!
వివరంగా..
మొదటి సగం (ఫస్ట్ హాఫ్)
పల్లెటూరు వాతావరణం. అక్కడి రాజకీయాలు. ప్రేమలు. మధ్యలో, ఘర్షణలు. బలం కోసం ఎత్తుగెడలు. అబ్బో. ఎన్నో సినిమాల్లో చూసే ఉంటారు. చూస్తున్నంత సేపు, మొదటి సగం ముఖ్యంగా, తర్వాతా ఏమి జరుగుతుంది అనేది చాలా ఈజీ గా గెస్ చేస్తూ ఉంటాడు ప్రేక్షకుడు. ఈ సమయంలో అఖిల్ కు తమన్ నుంచి మంచి సహకారం లభించింది. దర్శకుడు రాసుకున్న ప్రపంచం, పాత్రలు మధ్య ఉన్న వివిధ అనుబంధాలు వల్లన, మొదటి సగం అంతా, స్టోరీ సెటప్ మీదే ఎక్కువగా ఆధారా పడి ఉంటుంది.
ఇంటర్వెల్ ఎపిసోడ్ కోసం, ప్రేక్షకుడు కి తియ్యని షాక్ ఇచ్చే ప్రయత్నం బాగుంటుంది. తర్వాత ఏమి జరుగుతుందో అని ఉత్సాహం నింపుతాడు దర్శకుడు.
ట్విస్టుల మీద ట్విస్టులు తో సాగిన రెండవ సగం. (సెకండ్ హాఫ్)
Second half syndrome. చాలా సినిమాలు చతికిల పడ్డాయి అంటే, రెండవ సగం వలనే. దర్శకుడు ఈ పాయింట్ ను దృష్టిలో ఉంచుకుని, సినిమా చూసి బయటికి వెళ్ళే ప్రేక్షకుడు, కథ పాతదే, వాతావరణం కూడా పాతదే అని గుర్తు పెట్టుకుని, పాత్రల మధ్య సంఘర్షణలు, వాటి స్వభావాలు మారుస్తూ వచ్చాడు. ట్విస్ట్ ఇస్తున్నాము అని కింగ్ నాగార్జున ముందే చెప్పడం తో, ఈ సాగతీత లో, ఏమి జలక్ ఇచ్చాడో అఖిల్ అని ఎదురు చూసే ప్రేక్షకుడు కి, ఒక ఎమోషనల్ సీన్ షాక్ కి గురి చేస్తుంది. ( ఇదేదో కొత్త ట్విస్ట్ కాదు. బాలకృష్ణ నటించిన, ఒక్క సినిమాలో విలన్ రామిరెడ్డి ఇలానే చేయిస్తాడు). కథ పాతదే. ట్విస్ట్ పాతదే. పాత్రల స్వభావం కూడా పాతవే. మరి దర్శకుడు ఏమి చేశాడు? కేవలం చక్కని స్క్రీన్ ప్లే రాసుకుని, ఒక్కో ఎమోషన్ ను ఒక్కోలా, చిక్కుముడి విప్పుతూ.. తీసుకుని వచ్చారు, దర్శకుడు మురళి. ఈ ఒక్క విషయంలోనే “లెనిన్ ” నాకు పరవాలేదు అనిపించింది.
చివరగా…
ఈ మధ్య, తెలుగు సినిమా అంతా, పల్లెల మీద పడ్డారు. ఒక సదా సీదా కుర్రాడు.. అతని ప్రేమ. అతని ఫ్యామిలీ. అతని గతం. పల్లెటూరి కథలు ఎన్ని సార్లు చెప్పినా బాగుంటాయి. కానీ, అక్కడ హీరోయిజం, ఎలివేషన్ అంటూ, నేటివిటీ కు దూరం చేసే ప్రయత్నం చెయ్యకూడదు. పైగా ఈ మధ్య, పీకలు కొయ్యడం, రక్తం ను ఎక్కువగా చిందించడం కామన్ అయిపోయింది. ప్రేమ కథ లో, వయోలెన్స్ ఉందా, లేక వయోలెన్స్ ఉన్న కథలో ప్రేమ ఉందా? అనే సందేహంలో ప్రేక్షకుడు బయటికి వస్తాడు. ఒక పాత్ర కోసం, ఇంత విధ్వంసం సృష్టించే బదులు, ఆ పాత్ర చుట్టు కావలసినంత డ్రామా, లేకపోతే పాత్ర కు మరింత ఎమోషన్ జత చేసి ఉంటే బాగుండేది.
ట్విస్ట్లు కోసం వెయిట్ చేస్తే, సినిమా పరవాలేదు అనిపిస్తుంది. ట్విస్ట్ నాకు ఎందుకు, కథ ఏది? ఎమోషన్ ఏది? మహాభారతం అంటూ, కురుక్షేత్రం ను ఇంతలా చూపించాల్సిన అవసరం ఉందా? అనిపిస్తే మాత్రం, అఖిల్ కు మంచి సినిమా ఇంకా పడలేదు అనే భావన రాకమానదు.
(ఆల్రెడీ, హిట్ టాక్ వచ్చేసింది. జనాలు సినిమా చూసేస్తున్నారు కాబట్టీ, box-office దగ్గర కలెక్షన్స్ కు లోటు ఏమి ఉండదు.)
సినిమాను చదువుతున్న విద్యార్థులు ఎవరైనా, మంచి స్క్రీన్ ప్లే తో, నాసిరకం కథ ను ఎలా తియ్యాచో, “లెనిన్” చూసి నేర్చుకోవచ్చు.
I’m rating the film with 2.25/5
మీకు లెనిన్ ఎలా అనిపించాడో, కామెంట్ చెయ్యండి.
ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్టు అయితే, మీ రేటింగ్ తో తెలియచేయగలరు. మరో కొత్త సినిమాతో మళ్ళీ కలుద్దాము! 🙂