పెద్ది: పోరాడితే, పోయేది ఏముంది..  బానిస సంకెళ్ళు తప్ప! అని మరో సారి ఎలుగెత్తి చెప్పిన… ____ గ్రామం, సాలూరు మండలం, విజయనగరం జిల్లా వాసి.

సింపుల్ గా…

ఊరి కోసం మహా ఐతే, ఏమి చేస్తాము.. రోడ్లు వేయిస్తాము.. కరెంట్ సరఫరా చేయిస్తాము.. లేదంటే వాటర్ బోర్లు తవ్విస్తాము… కానీ, ఈ “పెద్ది ” గాడు.. ఊరు కోసం.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు ఆటలు ఆడేశాడు.. ఒకటి ఊరు లెవెల్.. రెండోది స్టేట్ లెవెల్… మూడోది నేషనల్ లెవెల్..

ప్రపంచం గెలిచిన వాడి మాట మాత్రమే వింటుంది అని, గెలుపు కోసం మహా యుద్ధమే చేశాడు పెద్ది. మరి గెలిచాడా?

రామ్ చరణ్.. సినిమా కే కాదు.. తన కెరీర్ లోనే చిరకాలం నిలిచిపోయే పాత్ర చేశారు. అద్భుతంగా నటించి, మెప్పించారు.

బుచ్చిబాబు “ఉప్పెన” తరహా, షాకింగ్ క్లైమాక్స్ రాసుకున్నాడు. (దాని గూర్చి కిందన మళ్ళీ వ్రాస్తాను స్పెషల్ గా…) ఎమోషనల్ గా సినిమా బాగానే ఉన్నా… క్లైమాక్స్ లో పాత్రలు నడిచిన తీరు.. సినిమా మారిన విధానం.. కొంచెం కొత్తగానే ఉంటుంది.. క్లైమాక్స్ ను యాక్సెప్ట్ చేయగలిగితే, మంచి సినిమా చూసాము అనే భావన లో బయటకి వస్తాము.. క్లైమాక్స్ ను యాక్సెప్ట్ చెయ్యలేకపోతే.. ఉడికి ఉడకని అన్నంతో.. దమ్ బిర్యానీ తిన్నట్టు ఫీల్ అవుతాము.. ఏదైనా ఒకసారి హాయిగా చూడొచ్చు!

రామ్ చరణ్.. వాహ్ ఉస్తాద్ వాహ్!

అందరూ.. రాంచరణ్ కి నేషనల్ అవార్డ్ వస్తుంది అంటే.. సినిమా అమ్మడానికి వంద కబుర్లు చెప్తారు.. రామ్ చరణ్ నటన మనకి తెలియనిదా అని, చాలా తక్కువ అంచనాలు తో కూర్చున్నాను థియేటర్ లో. రంగస్థలం లో నటించినా.. అది సుకుమార్ మ్యాజిక్ అనుకునే వాడ్ని.. నన్ను తప్పు అని ప్రూవ్ చేయడానికి.. రామ్ చరణ్ కి ఎంతో సేపు పట్టలేదు.. బ్యాట్ తీసుకుని… చెదిరిన జుట్టు… బాగా వత్తుగా పెరిగిన గెడ్డం తో గ్రౌండ్ లో అడుగు పెట్టగానే.. నా లాంటి ఎంతో మందిని తన అభిమానులు గా మార్చుకున్నాడు.. మొదటి భాగం అయ్యేసరికే, తన లోని నటుడు కి ఉన్న ఆకలి అంతా తీర్చుకున్నారు.

కుస్తీ ఎపిసోడ్స్, సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్.. హాస్పిటల్ సీన్ తో.. విమర్శకుల సైతం.. వాహ్ ఇన్నాళ్లు ఇలాంటి నటన ఏమైంది అనుకోక మానరు! ప్రశంసల జల్లు కురిపించక మనరు . అద్భుతం. ! జిందాబాద్ చరణ్.!

Buchibabu మరియు క్లైమాక్స్..

“ఉప్పెన ” సినిమా చూసిన వారు ఎవరైనా.. ఈ సినిమా క్లైమాక్స్ లో, దర్శకుడు బుచ్చిబాబు ఏమి చేస్తాడో అని ఎదురు చూడక మానరు. క్లైమాక్స్ లో షాక్ ఇవ్వాలి అనుకోవడం లో తప్పేమి లేదు. కానీ, అది సినిమా గమనాన్ని ఎలా మారుస్తుందో చూసుకోవాలి. రామ్ చరణ్ లాంటి స్టార్ ను ఉంచుకుని… కుస్తీ ఎపిసోడ్స్ దాకా చాలా చక్కగా ఒక్కో సీన్ రాసుకుంటూ… ఫ్యాన్స్ కి కావలసిన ఎంటర్టైన్మెంట్ ఇచ్చుకుంటూ వస్తూ…. ఒక్కసారిగా, సినిమా నిడివి ఎక్కువ అయింది అనుకున్నాడేమో.. త్వరత్వరగా సినిమా కి శుభం కార్డు పడేసే ప్రయత్నం చేసాడు.

ఈ సమయంలో.. ఎంతో ఎమోషనల్ గా ఉండాల్సిన ఒక్క సీన్… పేపర్ మీద బాగున్నా.. స్క్రీన్ మీదకి వచ్చేసరికి.. తేలిపోయింది.. రామ్ చరణ్ నటన, హావభావాలు వలన climax చూడగలిగాను కానీ… అంత తొందరగా.. ఎమోషనల్ backdrop ఏది లేకుండా , క్లైమాక్స్ రాసుకోవడం బాలేదు.

చివరగా….

రామ్ చరణ్ అద్భుతమైన నటన, రెహ్మాన్ చక్కని బాణీలు.. నటీనటుల పెర్ఫార్మెన్స్.. సాంకేతిక విభాగం పనితీరు.. అన్ని చక్కగా కుదిరినా..  క్లైమాక్స్ లో, షాక్ ఇచ్చే ప్రయత్నం లో.. దర్శకుడు.. ప్రేక్షకుడు నుంచి మంచి సినిమా చూసాను అనే భావనను లాగేసుకున్నాడు.

నాకైతే.. క్లైమాక్స్ వరకు సినిమా చాలా బాగా నచ్చింది. సినిమాను ఎండ్ చేసిన తీరు మీదే నా కంప్లైంట్!

I am rating the film with 2.75/5

(ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో రేటింగ్ ఇవ్వండి.. సినిమా చూసినట్టు అయితే.. మీ రివ్యూ కామెంట్ చెయ్యండి. మళ్ళీ కలుద్దాము! )

4.6/5 - (18 votes)

2 thoughts on “పెద్ది: పోరాడితే, పోయేది ఏముంది..  బానిస సంకెళ్ళు తప్ప! అని మరో సారి ఎలుగెత్తి చెప్పిన… ____ గ్రామం, సాలూరు మండలం, విజయనగరం జిల్లా వాసి.”

Leave a Comment