OG మరియు నా expectations :
హరిహర వీర మల్లు సినిమాకి వచ్చిన అభిమానులు, OG OG అంటూ అరుస్తూ ఉంటే, OG కూడా హరిహర వీర మల్లు లాగా అయిపోతే, ఏంటి పరిస్థితి అనుకున్నాను? Clearance sale లాగా బాకీ ఉండిపోయిన పవన్ కళ్యాణ్ సినిమాలు ఒక్కొకటి గా వస్తుండటం తో, నాకు OG మీద పెద్దగా ఆశలు ఏమి లేవు! ఎక్కడో నేను అమితంగా ఇష్టపడే కళ్యాణ్ , తన అభిమానులకి ఒక్క మంచి సినిమా ఇవ్వకపోడా అని నమ్మకంతో థియేటర్ లోకి అడుగు పెట్టాను!
నాకు బాగా నచ్చిన అంశం
సినిమా మొదటి ఫ్రేమ్ నుంచే, దర్శకుడు సుజీత్ తను అనుకున్న మాఫియా gangstar యూనివర్స్ లోకి తీసుకుని వెళ్ళిపోయాడు. ముఖ్యంగా, కళ్యాణ్ ను ప్రజెంట్ చేసిన తీరు అమోఘం! స్టోరీ తో పాటు, కళ్యాణ్ ను రెండు సార్లు ఇంట్రడ్యూస్ చేసిన విధానం బాగుంది. ఒక్కసారి animated కళ్యాణ్ హంగ్రీ చీత అంటూ వస్తే, ఒక్క 15 నిమిషాలు తర్వాత.. Katana పట్టుకుని, అసలైన కళ్యాణ్ మన ముందు ఉంటాడు.
సెకనుకోక తల తెగి పడేనే అనే పాట కి ధీటు గానే, కళ్యాణ్ Katana ను own చేసుకున్న విధానం, తన చుట్టూ అల్లుకున్న కథ కి, ఎంత కావాలో అంతే సమయం కనిపిస్తూ.. ఛాన్స్ దొరికిన ప్రతీసారీ, రక్తపాతమే లక్ష్యంగా కథని ముందుకు తీసుకుని వెళ్తూ.. ప్రతి అభిమాని ఆకలి తీరుస్తూ.. ఒక్క catalyst లా దూసుకుపోయాడు!
ఇక సినిమా ending లో వచ్చే, Japanese ఎపిసోడ్, సినిమకే హైలైట్. జాన్ విక్ స్టైల్ లో కళ్యాణ్ ను చూపించే ప్రయత్నం బాగుంది.
తమన్ విధ్వంసం
నాకు ఈ ఏడాది బాగా నచ్చిన సినిమాల్లో, డాకు మహారాజ్ ఒకటి. బాలయ్య విశ్వరూపం కు, నందమూరి తమన్ చేసిన డ్యూటీ ఇప్పటికీ గుర్తుంది.ఈ సినిమాకి, పవన్ కళ్యాణ్ అభిమానిలో ఒక్కడిని నేను అంటూ, స్క్రీన్ మీద కళ్యాణ్ ఫైట్స్ చేస్తుంటే, ఆ visuals ను next level కు తీసుకుని వెళ్ళిపోయాడు! తమన్ చేసిన విధ్వంసం, మంచి Dolby థియేటర్ లో చూస్తేనే అర్థం అవుతుంది. సినిమా సినిమాకి ప్రాణం పెట్టి, దర్శకుడు కన్నా, ఎక్కువుగా కష్టబడే వ్యక్తి తమన్. హ్యాట్సాఫ్ తమన్! ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్ ఆయనే!
సినిమాలో నాకు నచ్చని విషయాలు
అభిమాని కోసమే సినిమా ఇది. వేరే హీరో అభిమాని.. కళ్యాణ్ కి కనెక్ట్ కానీ వారికి, elevations కోసమే సినిమా తీసారా? అన్నట్టు ఉంటుంది. ఇంతా elevations, martial arts, gangstar డ్రామా ఉన్నప్పటికీ, సినిమాలో సరైన కథ లేకపోవడం.. రెండో భాగంలో డ్రామా ఎక్కువ అయ్యి, సినిమా పేస్ తగ్గడం.. పెద్ద మైనస్ గా మిగిలాయి. ప్రతి పావు గంట కి ఒక్కసారి కళ్యాణ్ ను స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేసినా, elevations రొటీన్ అయిపోవడం, సుజిత్ కి రచన అనుభవం లేకపోవడంతో కొన్ని సన్నివేశాలు, అంత అంత మాత్రంగానే ఉంటాయి. మరీ పేలవంగా ఉన్నాయి అనను కానీ, ఇంకాస్త screenplay పైన శ్రద్ధ పెట్టుంటే, neutral ఆడియెన్స్ కూడా ఈ OG మ్యాజిక్ లో మునిగి తెరేవారు!
Final Take
ఇదేదో కొత్త కథ కాదు. మనకి తెలియని screenplay లేదు. సుజిత్ క్రియేట్ చేసిన ఈ యూనివర్స్ లో, కళ్యాణ్ కొత్తగా కనిపించాడు. అభిమాని కోరుకునే హై ఎపిసోడ్స్ ఎన్నో! కెమెరా విభాగం బాగుంది. మిగతా ఆర్టిస్ట్స్ తమ పరిధి మేర బానే నటించారు!
Political గా వేరే సిద్ధాంతాలు ఉన్న కళ్యాణ్ అండ్ ప్రకాశ్ రాజ్.. సినిమాలో మాత్రం అందుకు విభన్నంగా, చాలా చక్కగా కలిసి నటించారు. అందుకే సినిమా ఒక్క మాయ అంటారు ఏమో!
నాకు ఐతే, బానే నచ్చింది. యాక్షన్ ను ఇష్టబడే వారు ఒక్కసారి హాయిగా చూసేయొచ్చు!
ఈ సినిమాకి నేను 3/5 ఇస్తున్నాను!
Perfect review
Sounds fair, and I wish this movie and the entire team great success and positivity
Good review sir
Bomma block buster
Nice dude
మీరు చెప్పే రివ్యూ కోసం వెయిట్ చేశాను… మరియు మీరు చెప్పే ఈ మూవీ లో ఉండే పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ అనేవి క్లియర్ గా చెప్పారు, ఒక pspk అభిమానిగా అండ్ ఒక సగటు మూవీ అభిమానిగా అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పే విధానం నాకు నచ్చింది… ఎప్పుడూ ఇలా జెన్యూన్ రివ్యూస్ ఇస్తూ వుండాలని కోరుకుంటూ… Thank you అండ్ all the best sir
Thank you, Mouli 🙂
Good analysis…
Nice action movie pawan kalyan style super 🔥
Good review
BlockBuster
Good review
Nice revivew ,
Hope pavan is back like wise Thammudu.
Me review kosam chusanu… Really good information…thanks
Tomorrow or day after tomorrow veltha
Very well written … very neutral and unbiased review 👏🏼👏🏼
Thank you, Joga 🙂
Fantastic review. Long way to go !!
For PK fans I have witnessed how much everyone has enjoyed the movie. For everyone else it is a good one time watch with good music at correct places. I wish Pawan Kalyan continues in scripts where his serious intent itself is enough to drive the movie.