ఉస్తాద్ భగత్ సింగ్: ఉగాది రోజున కొత్త చింతపండు, మీ ఉగాది పచ్చడిలో.. పాత చింతకాయ పచ్చడి.. మీ అభిమాన థియేటర్లో!

సింపుల్ గా…

పదాలు బాగున్నాయి. ప్రాసలు కుదిరాయి. Performances అదిరిపోయాయి. కానీ, స్టోరీ ఏది హరీష్ శంకరూ?

ముందుగా.. అందరికీ ఉగాది శుభాకాంక్షలు! చాలా రోజులు అయ్యింది ఇలా మిమల్ని పలకరించి. నా పర్సనల్ లాస్ నుంచి తేరుకుని, జీవితంలో ఒక్కో అడుగు ముందుకి వేస్తున్నాను. ఈ సమయంలో, సినిమాలు కు కొంచెం దూరం అయినా, రాయడం ఏ రోజు మానేయలేదు. సినిమా అనే ఎమోషన్ నన్ను చాలా సార్లు, డిప్రెషన్ నుంచి బయటకి తీసుకుని వచ్చింది.

జీవితంలో కొత్త ఆనందాలు పలకరిస్తున్నాయి. కొత్త సంవత్సరం.. కొత్త ఆశలు చిగురించింది! మరియు ఈ సంవత్సరం  మీకు మీ శ్రేయోభిలాషులకు కూడా అనందాన్ని, మరెన్నో మర్చిపోలేని జ్ఞాపకాలు పంచాలని కోరుకుంటూ… ఉగాది శుభాకాంక్షలు , డియర్ Sai Talks Cinema రీడర్స్ 🙂

ఇక సినిమా గూర్చి..

Fan ఐతే.. స్టోరీ వద్దా?

ఉస్తాద్ భగత్ సింగ్. పేరులో ఉన్న ధైర్యం.. కళ్యాణ్ కళ్లలో సినిమా అంతా కనిపిస్తుంది. ఇది పవన్ కళ్యాణ్, ఔట్ అండ్ ఔట్ ఉన్న సినిమా.  ఈ మధ్య కాలంలో కల్యాణ్,  ప్రతి సన్నివేశంలో ఉండే సినిమా రాలేదు . ప్రతి చోట చలాకి గా తిరుగుతాడు. హాయిగా నవ్వుకుంటాడు. Villains కి వార్నింగ్స్ ఇస్తూ ఉంటాడు. అన్ని కుదిరిన, ఏదో మిస్ అయ్యినట్టు.. స్టోరీ మరి పాత చింతకాయ లాగ, మరి చప్పగా, నాసిరకం గా, ఏదో తెలిసినట్టు మన కళ్ళ ముందే కనిపిస్తుంటే, ఎంత కళ్యాణ్ అభిమాని అయినా, సంతృప్తి గా బయటకి రాలేడు!

అయితే.. బాలేదా..?

పర్వాలేదు. ఎక్కడా బోర్ కొట్టకుండా, స్క్రీన్ ప్లే అలా అలా సాగిపోతుంది. తెలిసిన కథే. ఇలాంటి కథలు.. గోపిచంద్ తీసాడు. బాలయ్య బాబు తీసాడు.. రామ్ పోతినేని తీసాడు.. ఇప్పుడు ఇలాంటి కథే, కళ్యాణ్ దగ్గరకి వచ్చి పడింది. పెద్దగా ఆశించకుండా వెళ్తే, పెద్దగా నిరుత్సాహ పడరు!

శ్రీలీల నటన బాగుంది. సెకండ్ హాఫ్ లో, లవ్ ట్రాక్ మొదట ఎబ్బెట్టుగా ఉన్నా, శ్రీలీల హావభావాలు తో, కొన్ని సీన్స్ హృద్యంగా అనిపించాయి. ( ఈ సమయంలోనే, కళ్యాణ్ పాత సినిమా సాంగ్స్ మిక్స్ వస్తుంది. )

చివరగా..

ఫస్ట్ హాఫ్ లో, వచ్చే కళ్యాణ్ ఫేస్ రెవీల్ సీన్.. అద్భుతమైన ఎలివేషన్! ఇలా అక్కడక్కడ, ఫాన్స్ కి కావలసినవి ఉన్నా, OG చూసిన కళ్ళతో, ఈ నాసిరకం ప్రొడక్ట్ ను యాక్సెప్ట్ చెయ్యడం కష్టమే! బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం తమన్ మరోసారి, సౌండ్ డెసిబెల్స్ పెంచేసి, ఆ రెండు మూడు ట్రాక్ సినిమా అంతా వాడేశాడు. ఇక, హరీష్ శంకర్.. “తేరి” సినిమా లో మూలాన్ని, ఎవ్వరికి తెలియకుండా, చాకచక్యంగా లాగేసి, నచ్చినట్టు మార్చేసి, ప్రాసలు.. రిఫరెన్స్.. డాన్సులు.. ఫైట్స్ అంటూ మానేజ్ చేసినా.. తెలిసిన కథే కావడం.. స్క్రీన్ ప్లే లో దమ్ము లేకపోవడంతో, టైటిల్ లో ఉన్న ధైర్యం, సినిమా కథలో  కనిపించలేదు!

నేను ఈ సినిమా కి… 2.25/5 ఇస్తున్నాను!

4.7/5 - (11 votes)

6 thoughts on “ఉస్తాద్ భగత్ సింగ్: ఉగాది రోజున కొత్త చింతపండు, మీ ఉగాది పచ్చడిలో.. పాత చింతకాయ పచ్చడి.. మీ అభిమాన థియేటర్లో!”

    • E madhya cinema chudakunda ne athivinayam pradarsisthu comment peduthunnaru andi nikhilesh garu. Meeru ante anni chusi pedtharu anukondi. Me twitter accounts bhale vuntai andi. Cinema kuda akkade chusesanu ani mathram cheppakandi.

      Reply

Leave a Reply to Nikhilesh Cancel reply