కాంత (2025) : మొదటి భాగం  సినిమా. రెండో భాగం  మిస్టరీ. అయినా, కష్టంగానే చూడాలి!

నాకు ఎదైన సినిమాలో, సినిమా ప్రపంచం పరిచయం చేసి, సినిమా కోసం మాట్లాడితే , ఎంతో ఆసక్తి గా చూస్తాను. అలానే, ” కాంత” ట్రైలర్ చూసి, సినిమా కోసం బాగా వెయిట్ చేసాను. దాదాపు ఒక్క నెల తర్వాత, థియేటర్ లో చూసిన సినిమా ఇది. (Oct 19, 2O25 తర్వాత, థియేటర్ లో చూసిన సినిమా ఇదే!)

సినిమాలో సినిమా!

తొలినాట సినిమా ప్రపంచం, తెర మీద కష్టం.. తెర వెనుక అహంకారం. ఇలా మొదటి భాగం అంతా, సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకుడు కి,  ఒక్క చక్కని సినిమా ప్రపంచం చూపించి బాగానే అలరించారు దుల్కర్, సముద్రఖని, భాగ్య శ్రీ! సినిమా అనే మాయ ప్రపంచం లో ఇన్ని కోణాలు ఉంటాయి అని, యంగ్ మైండ్స్ కి చూపించే ప్రయత్నం బాగుంది. ఈ సినిమా మొదటి భాగం చూసి, జీవితంలో ఏమి అవ్వాలో ఇంకా నిర్ణయం తీసుకోని వారు ఎవరైనా, ఆ ట్రాన్స్ లో దర్శకుడు లేదా కథానాయకుడు అవుదాం అనుకుంటారు. సినిమా మీద ఇష్టం ఉన్న వారు ఇంకాస్త ఎక్కువగా సినిమా ప్రపంచం మీద మక్కువ తెచ్చుకుంటారు. అంత బాగుంది మరి మొదటి భాగం!

రెండో భాగం కి ఏమైంది?

మొదటి భాగం చూసి , బాగానే సినిమా మాయలో పడిన ప్రేక్షకుడు కి, ఇంటర్వెల్ లో వచ్చే సన్నివేశం , రెండో భాగం వైపు ఆసక్తిగా ఎదురు చూసేలా చేస్తుంది. రెండో భాగం కూడా, సినిమా రాజకీయం ఉంటుంది అనుకునే వాడికి.. దర్శకుడు తియ్యనైన షాక్ తో, ఇంటరాగేషన్ అంటూ మొదలు పెడతారు. అక్కడ మొదలు అవుతుంది అస్సలు సమస్య! ఎన్ని సార్లు  తీసినా, మర్డర్ మిస్టరీ కోణం ఎప్పుడూ బాగానే ఉంటుంది. పైగా సినిమా సెట్లో మర్డర్ అంటే, ఇంకేం ఉంది? కానీ.. అక్కడ నుంచి సినిమా షిఫ్ట్ అయ్యిన తీరు. పాత్రలు చుట్టూ అల్లుకునే డ్రామా, ఏమాత్రం సంబంధం లేకుండా ఉంటాయి!

మొదటి గంట ఏమి చూసామో, చివరి గంట ఏమి చూస్తున్నామో, డిసైడ్ కాలేక , థియేటర్ కి వచ్చిన  ,ప్రేక్షకుడు నిరుత్సాహం పడటం కనిపించింది. రానా కి ఏమైంది? తన నటన మితి మీరి ఉండటంతో పాటు, ఓవర్ ది బోర్డు ఎమోషన్స్ తో కథని అక్కడ అక్కడే తిప్పుతూ, మొదటి భాగం ఇచ్చిన అనుభూతి నీ చెరిపేస్తారు .

చివరగా..

విడి విడిగా చూస్తే, సినిమా ప్రపంచం ఒక్క ఆలోచన. మర్డర్ మిస్టరీ ఒక్క ఆలోచన. సినిమా సెట్ లో మర్డర్ మిస్టరీ అనేది కొత్త ఆలోచనే! (అగస్టా క్రిస్టీ నవలలు ఆధారంగా వచ్చిన సినిమాలు లోనూ ఇలాంటి వింత మిస్టరీస్ ఉంటాయి). దర్శకుడి ఆలోచన కి సరిపోయే స్క్రీన్ ప్లే, సంభాషణలు లేకపోవడం, పాత్రలు నడిచే తీరు పేలవంగా ఉండటంలో, రెండో భాగం ఈ సినిమాని కిందకి నెట్టేశాయి అనే చెప్పాలి.

నాకు అయితే, ఈ సినిమాలో, నటి భాగ్య శ్రీ పాత్ర బాగా నచ్చింది. ఆమె నటన అమోఘం! దుల్కర్ గురించి తెలిసిందే. ఎలాంటి పాత్రనైనా ఇట్టే పట్టేస్తాడు. అది సినిమా హీరో పాత్ర ఐతే మరీను..

నాకు ఈ సినిమా మొదటి భాగం బాగా నచ్చింది. సినిమా ప్రపంచం, అక్కడి సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి.

నేను ఈ సినిమాకి 2.25/5 ఇస్తున్నాను!

4.9/5 - (14 votes)

6 thoughts on “కాంత (2025) : మొదటి భాగం  సినిమా. రెండో భాగం  మిస్టరీ. అయినా, కష్టంగానే చూడాలి!”

  1. Watched this movie only for DQ. But disappointed. Low budget movies are good but not the whole movie in one room or a single set.

    Reply

Leave a Reply to Srikanth Golla Cancel reply