తెలుసు కదా/ K Ramp / Dude : నేను బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఏది అంటే ?

ఒక్కే రోజు .. మూడు సినిమాలు..

దీపావళి అంటేనే , పటాకాలు , చిచ్చుబుడ్డిలు మరెన్నో జ్ఞాపకాలు . ప్రతీ పండుగకి , సినిమా వాళ్ళు ఏదో రూపం లో మనకి hi చెబుతూనే ఉంటారు. అలా ఈ దీపావళి కి , మూడు తెలుగు సినిమాలు , ఒక్క తమిళ డబ్బింగ్ సినిమా విడుదల అయింది. ఒక్క సినిమా అంటేనే ముందు ఉండే నేను , నాలుగు సినిమాలు అంటే , నా ఆనందానికి అవధులు లేవు! నిన్న ఒక్క రోజే నేను మూడు సినిమాలు ( తెలుసు కదా , K RAMP , DUDE) చూశాను. (ఈ మూడు సినిమాలు కి కలిపి కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మరియు నేను సినిమాలు చూసిన ఆర్డర్ లో రాస్తున్నాను )

ముందుగా తెలుసు కదా..

“తెలుసు కదా” .. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ “నీరజ కోన ” రచించి దర్శకత్వం వహించిన సినిమా “తెలుసు కదా.” అమ్మాయిలు రాసుకునే కథల్లో,ప్రేమ పెళ్ళి…పిల్లలు.. పప్పీ లు ఇవన్నీ కామన్ . మొదటి 20 నిమిషాలు ఇలానే సాగింది కథ.. కానీ ఆ తర్వాత , నీరజ కోన,  తనలోని రచయిత , మెచ్యూరిటీ కు పదును పెడుతూ.. కథని నడిపించిన తీరు అద్భుతం.

అమ్మాయి సినిమా తీసారు కాబట్టీ, అబ్బాయిలు కి వ్యతిరేకం గా తీసి ఉంటారు అనుకోకండి! ఇందులో సిద్దు పాత్ర లోని క్లారిటీ.. అందులో dimensions, నాకు తెలిసి.. ఏ రచయిత కూడా హాండిల్ చెయ్యలేడు! సిద్దు పాత్ర కి కావాల్సిన క్లారిటీ ఇస్తూ, confusion మొత్తం ఇద్దరు హీరోయిన్లు కి ఉంచేసి, సినిమా ను భలే నడిపించారు నీరజ!

అనురాగ్ బసు తీసిన,” లైఫ్ ఇన్ మెట్రో ” చూసి.. మన తెలుగు వాళ్ళు ఎందుకు, జీవితం కి, ప్రేమకి కొత్త గ్రామర్ ఇచ్చే పాత్రలు రాయరు అనుకునే వాడ్ని. బహుశా రాసినా, accept చేసే విజ్ఞత, digest చేసుకునే మెచ్యూరిటీ ఈ తరం కి లేదు అనుకున్నారు ఏమో! EVV సత్యనారాయణ గారి ” ఇంట్లో ఇల్లాలు.. వంటింట్లో ప్రియురాలు “రిలీజ్ అయినప్పుడు కూడా,  అప్పటి తరంలోను విపరీతంగా accept చేసిన వారు ఉండే ఉంటారు!

ఇది ఒక్క రివెంజ్ డ్రామా అన్నాడు సిద్దు. ప్రేమ ఉన్నప్పుడే రివెంజ్ కూడా ఉంటుంది. కంటెంట్ అయితే బోల్డ్ కాదు. కానీ పాత్రలు నడిచే తీరు మనం రెగ్యులర్ గా యాక్సెప్ట్ చేసేలా ఉండవు! అవి హాండిల్ చేసే emotional intelligence మీకు ఉంటే, ఈ సినిమా చూడండి! లేదంటే.. OTT వరకు వెయిట్ చేసి, అప్పుడు జడ్జ్ చెయ్యండి! నన్ను మాత్రమే కాదు. సినిమా ను కూడా. ఎందుకంటే….” తెలుసు కదా”

( ఈ సినిమా కు నా పూర్తి రివ్యూ కూడా ఒక్క లుక్ వెయ్యండి ! )

I’m rating this movie with 3/5.


తరువాత , కిరణ్ అబ్బవరం నటించిన , ” K RAMP “

కిరణ్ అబ్బవరం .. పెద్ద నటుడు ఏమికాదు . తన సినిమాలు లో కథలు , తాను తీసుకునే ఛాలెంజింగ్ పాత్రలు , ఆడియన్స్ కి కొత్త అనుభవాలు ఇస్తూ ఉంటాయి. అలా , అతను చేసిన K RAMP, నవ్వులు బానే తెప్పించింది .

ఇది సాదాసీదా కుర్రవాడి కధ. మనం తరచుగా చూసే డబ్బు ఉన్న నాన్న , spoiled brat అయిన కొడుకు కథ. మొదటి హాఫ్ అంతా కాలేజీ episodes కాస్త బోర్ కొట్టించినా , ఇంటర్వల్ దగ్గర హీరోయిన్ పాత్ర లోని కొత్త కోణం , సినిమా కి, హీరో పాత్ర కి మంచి మైలేజ్ ఇచ్చింది.

ఇక , సెకండ్ హాఫ్ మొదలు అవుతూనే , కామిడీ టచ్ ఇస్తూ , హీరోయిన్ పాత్ర కి ఉన్న , (PTSD disorder ) ని జనాలకి పరిచయం చేస్తూ, కాసేపు నవ్వులు బాగానే తెప్పించాడు దర్శకుడు జైన్స్ నాని.

మారుతి తీసిన , ” ప్రేమ కథ చిత్రం ” లోని హీరోయిన్ దెయ్యం పాత్ర టెంప్లేట్ లో , ఒక్క మెంటల్ disorder ని పెట్టి , సినిమా ని తీశారా అనే డౌట్ వస్తుంది. స్క్రీన్ మీద పాత్రలు మనల్ని అలరిస్తూ ఉంటాయి. నరేశ్ కామిడీ కొంచెం మితిమీరి ఉంటుంది. సినిమా లో , adult డైలాగ్ లు బోలెడన్ని ఉన్నాయి. కాబట్టి , సినిమా చూసే ముందు వీటికి సిద్దపడి ఉంటే , సెకండ్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ మీకు నచ్చుతుంది.

I am rating, K- RAMP with 3.25/5

(సమయం లేనందున పూర్తి రివ్యూ ఇవ్వడం కుదరలేదు . త్వరలోనే అప్డేట్ చేస్తాను )


ఇక చివరిగా , తమిళ డబ్బింగ్ సినిమా , DUDE

ప్రదీప్. తమిళ దర్శకుడు ( జయం రవి నటించిన కోమలి ) మరియు నటుడు ( లవ్ టుడే , డ్రాగన్ ). ధనుష్ పెద్ద సినిమాలు తో బిజీ అయిపోవడం , అల్లరి చిల్లరి పాత్రలకి , తమిళం లో సరైన నటులు లేకపోవడం తో , ప్రదీప్ హవా నడుస్తోంది ఇప్పుడు. “డ్రాగన్ ” మన తెలుగు వాళ్ళకి కూడా నచ్చడం తో , ఈ సినిమా ని తెలుగు లోనూ బాగానే ప్రమోట్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ Sai Abhyankkar పాటలు కూడా బాగుండటం తో, రిలీస్ కు ముందే యువత లో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ సినిమా. కానీ ..

సినిమా మాత్రం ఆకట్టుకోవడం లో విఫలం అయింది. స్క్రీన్ మీద పాత్రలు over the top ఎమోషన్ పండిస్తూ , కనీసం, సినిమా కి వచ్చిన ఆడియన్స్ ఏమి ఆశించి వచ్చారో , మాకు అనవసరం అనట్టూ , సినిమా తీసుకుంటూ వెళ్లిపోయారు. ! ఇది ఆర్య 2 కథే. ! ఆ కథానే మళ్ళీ తీసి , తెలుగు లో డబ్ చేసి విడుదల చేయాలనుకోవడం , నాకు ఆశ్చర్యం గా అనిపించింది.

నేను అయితే ఈ సినిమా ని చూడమని రికమెండ్ చెయ్యను. OTT లో కూడా కష్టమే!

I am rating this movie with 1.5/5

(సమయం లేనందున పూర్తి రివ్యూ ఇవ్వడం కుదరలేదు . త్వరలోనే అప్డేట్ చేస్తాను )


సో.. మూడు రివ్యూలు చదివారు కాబట్టి , నేను బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఏదో మీకు అర్దం అయ్యే ఉంటుంది . పర్సనల్ గా నేను ” తెలుసు కదా ” ని బాగా ఎంజాయ్ చేశాను. కానీ , అందరికీ నచ్చే కంటెంట్ కాకపోవడం తో , ” K – RAMP” ను రికమెండ్ చేస్తున్నాను. ఇవి గొప్ప సినిమాలు అయితే కాదు. కానీ పండుగకి , అలా వెళ్ళి సరదాగా చూసి వచ్చేయడం లో అయితే ఏమి హాని చెయ్యవు ! 🙂 మరి మీకు ఏ సినిమా నచ్చిందో కామెంట్ చేయండి !

4.8/5 - (15 votes)

2 thoughts on “తెలుసు కదా/ K Ramp / Dude : నేను బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఏది అంటే ?”

Leave a Reply to Sai gadu masssu Cancel reply