నారి నారి నడుమ మురారి (2026) & సంక్రాంతి సినిమాలు

Sai Talks Cinema Readers కి, సినిమా ప్రేమికులు కు, సంక్రాంతి శుభాకాంక్షలు! సంక్రాంతి అనగానే గుర్తొచ్చేవి, భోగి మంటలు, గాలిపటాలు, పొంగలి & పిండి వంటలు , చుట్టాలు మరియు సినిమాలు. ఇలా ఈ సారి, మన తెలుగు సినిమా నుంచి ఐదు సినిమాలు సంక్రాంతి కి పలకరించాయి.

వాటిలో నాకు నచ్చిన సినిమాలు ఆర్డర్ వైజ్ ఇచ్చాను, ఈ ఆర్టికల్ లో..

ముందుగా, నారి నారి నడుమ మురారి మీద నా అభిప్రాయాన్ని సింపుల్ గా చెప్పేస్తాను!


నారి నారి నడుమ మురారి – మరొక్క చక్కని సంక్రాంతి సినిమా !

శర్వానంద్ మంచి నటుడు. ఏదైనా కళ్ళతోనే హావభావాలు బాగా పలికించగలడు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటుడు పైగా, సంక్రాంతి సీజన్ అనగానే, హిట్ సినిమాలు ఇచ్చే అలవాటు ఉన్న నటుడు. అతని స్టోరీ జడ్జిమెంట్ ఎప్పుడూ బాగానే ఉంటుంది!

ఈ సంక్రాంతి కి శర్వానంద్ నటించిన…  “నారి నారి నడుమ మురారి” నాకు బాగా నచ్చింది. మొదటి సగం లో వచ్చే కామెడీ సీన్స్, నరేష్, సత్య, సుధాకర్ కామెడీ భలే వచ్చాయి. ఆ సమయంలోనే, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కూడా తోడు అయ్యి, మొదటి సగం మంచి పండుగ సినిమా vibes ఇచ్చింది..

రెండవ సగం, కొంచెం నెమ్మదించినా, చివరి 20 నిమిషాలు మళ్ళీ, దర్శకుడు రామ్ అబ్బరాజు స్క్రీన్ ప్లే లో పరుగులు తీసుకుని వచ్చి, మంచి ఎపిసోడ్స్ బ్యాక్ టు బ్యాక్ రాసి, అలరించారు.

ఈ సంక్రాంతి కి, హాయిగా చూసేసే సినిమాల్లో, మొదటి వరుస లో ఉంటుంది ఈ సినిమా.

నేను, ఈ సినిమాకి 3/5 రేటింగ్ ఇస్తున్నాను!


సంక్రాంతి సినిమాలు మరియు నేను రికమెండ్ చేసే ఆర్డర్

  1. మన శంకర వర ప్రసాద్ గారు
  2. నారి నారి నడుమ మురారి
  3. అనగనగా ఒక రాజు
  4. భర్త మహాశయులకి విజ్ఞప్తి
  5. రాజా సాబ్

ఈ సంక్రాంతి చాలా మెమొరబుల్ నాకు అయితే!

ఎప్పటినుంచో, చిరంజీవి సినిమాల్లో మనం మిస్ అవుతున్న ఆయన నటన, కామెడీ టైమింగ్ ను అనిల్ రావిపూడి తిరిగి మనకి అందిస్తే… ఫ్యామిలీస్ కి చక్కని pricing లో (నారి నారి నడుమ మురారి కి hikes లేవు) ఒక్క మంచి ఫ్యామిలీ సినిమా ఇచ్చాడు శర్వానంద్!

కామెడీ అనగానే, డైలాగ్స్ చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలా.. కళ్యాణ్ శంకర్, నవీన్ పోలిశెట్టి కలిపి.. మనకి చక్కని one liners ఇచ్చారు,” అనగనగా ఒక రాజు ” లో. రెండవ సగంలో.. సినిమా ఆఫ్ ట్రాక్ వెళ్ళింది కానీ, మొదటి భాగంలో ఉన్న కామెడీ ఉండి ఉంటే, అనగనగా ఒక రాజు కూడా, నారి నారి నడుమ మురారి కి మంచి కాంపిటేషన్ ఇచ్చి ఉండేది.

ఇక.. రవితేజ నటించిన.. భర్త మహాశయులకి విజ్ఞప్తి.. ఈ టైటిల్ చూసి.. పెళ్ళి అయిన వారు.. రవితేజ మనకి ఏదైనా కొత్తగా చెప్పి అలరిస్తాడు అనుకుంటే, అది పొరపాటే! మరీ నీరసంగా.. ఎలా ముగించాలో తెలియక.. lazy గా రాసి తీసుకున్న కథ ఇది.

చివరగా.. రాజా సాబ్.. ప్రభాస్ లోని free flow ను గుర్తు చేశాడు మారుతి. Climax లో హిప్నాటిజం బాగుంది.. కానీ, ప్రేక్షకుడు కి అర్థం అయ్యే విధానం లో రాసుకుని ఉంటే, బాగుండేది.. నాకు అర్థం కావడం లేదా మీకు అర్థం కావడం ముఖ్యం కాదు. అందరికీ అర్థం అవ్వడంలోనే, దర్శక రచయిత నైపుణ్యం దాగి ఉంటుంది. ఆ విషయం లో “రాజా సాబ్” ఫెయిల్ అయ్యి, ప్రభాస్ కి మరియు అభిమానులు కి మర్చిపోయే సంక్రాంతి ను ఇచ్చింది.

ఈ సంక్రాంతి సినిమాలు జోరు ఇప్పుడే తగ్గవు. ఎంచక్కా.. థియేటర్ లో, మీరు.. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో సినిమాలన్నీ చూడాలని, మీకు ఇవి మర్చిపోలేని జ్ఞాపకాలు ఇంకెన్నో ఇవ్వాలని కోరుకుంటూ…

మీ,

Venkata Sai Pakala !

4.8/5 - (11 votes)

అనగనగా ఒక రాజు (2026) : నవీన్ పోలిశెట్టి లోని Stand-up comedian ఫుల్ గా డ్యూటీ చేసిన సినిమా.

సింపుల్ గా..

నవీన్ పోలిశెట్టి, సినిమాల్లోకి రాకముందు.. AIB అనే నార్త్ హిందీ యూట్యూబ్ ఛానెల్ లో, Stand-up, sketch comedy , skits లాంటివి చేసేవాడు. తర్వాత.. సినిమాల్లో ముఖ్యంగా తెలుగు సినిమా లో బిజీగా మారేకా, నటన మీదే ఫోకస్ పెట్టి.. కామెడీ ను తగ్గించాడు.. అతను లోని Stand-up కమెడియన్ ను బయటకి తీసి, రెండు గంటల పాటు.. వినోదం పంచాడు నవీన్. స్టోరీ.. స్క్రీన్ ప్లే.. డైలాగులు ఆయనవే! (Mad cinema దర్శకుడు కళ్యాణ్ శంకర్ కూడా రాసి ఉండొచ్చు.. క్రియేటివ్ డిఫరెన్స్ వలన ఆయన పక్కకి తప్పుకున్నారు అంటున్నారు)

రాజు గారు.. ఏమి చేశారేంటి?

వినోదం పంచారు. జమీందారు గారి మనవడి పాత్రలో ఒదిగిపోయారు. నవీన్ ఇందులో commercial మీటర్ కూడా క్యాచ్ చేస్తూ.. చక్కని డాన్సులు.. ఫైట్స్ చేశాడు. మొదటి భాగం బాగా నవ్వులు తెప్పించాడు నవీన్. రెండవ సగంలో కామెడీ తగ్గి, స్టోరీ మొదలు అవ్వడంతో , రాజు గారు కొంచెం నీరసించినా, క్లైమాక్స్ కి వచ్చేసరికి.. మళ్ళీ బాగానే ఎంటర్టైన్ చేశారు.

చివరగా..

రూరల్ కామెడీ కి ఎప్పుడూ తెలుగు సినిమాలో స్థానం ఉంటుంది. అది కూడా పండుగకి వస్తే, మరింత ఎక్కువగా ఆదరణ ఉంటుంది. “అనగనగా ఒక రాజు” కూడా జనాలు ను నవ్వించి, బయటకి హాయిగా పంపించే సినిమానే! నవీన్ చెప్పిన సింగిల్ లైన్ డైలాగ్స్ బాగా పేలాయి. రెండవ సగంలో, స్టోరీ మెయిన్ ట్రాక్ లోకి, ఎంటర్టైన్మెంట్ బ్యాక్ ట్రాక్ లోకి వెళ్ళడం తో, కొంచెం ఆ వినోదం తగ్గినట్టు అనిపిస్తుంది. మిక్కీ జే మేయర్ ఇచ్చిన పాటలు స్పీడ్ బ్రేక్స్ లా అనిపిస్తాయి. ఎడిటింగ్ విభాగం రెండవ సగంలో కేర్ తీసుకుని, క్రిస్పీగా కట్ చేసి ఉండాల్సింది.

మొత్తానికి, కొత్త కథైతే కాదు. ఎటువంటి expectations లేకుండా చూస్తే,  రెండు గంటలు పాటు అలా ఫ్యామిలీతో నవ్వుకుని వచ్చేయొచ్చు!

I am rating this movie with 2.75/5

4.7/5 - (12 votes)

భర్త మహాశయులకి విజ్ఞప్తి! (2026) : రవితేజ కి ప్రత్యేక విజ్ఞప్తి. Take a break!!

సింపుల్ గా:

రవితేజ మాస్ సినిమాలు తీస్తే, ఇతను క్లాస్ సినిమాలు తీస్తే భలే ఉంటుంది ఏమో అనిపిస్తుంది. అదే ఇతను క్లాస్ సినిమాలు తీస్తే, ఇతని ఎనర్జీ కి.. మాస్ సినిమాలు చెయ్యడమే కరెక్ట్ అనిపిస్తుంది. అలాంటి నటుడు రవితేజ!

ఏంటి విజ్ఞప్తి?

చెప్తాను.. లాగ్ లేకుండా! ఇద్దరు మహిళలు మధ్య చిక్కుకున్న మొగుడు పాత్ర ఎందరో నటులు గొప్పగా నటించి, మెప్పించి మళ్ళీ అవే తీసి తుస్ మనిపించారు. అందరూ చెయ్యగా లేనిది, నేను కూడా క్లాస్ గా.. ఇద్దరు అమ్మాయిలు మధ్య నలిగే పాత్ర ఎందుకు చెయ్యకూడదు అనుకున్నాడు ఏమో రవితేజ, ఈ ఐడియా…దర్శకుడు కిషోర్ తిరుమల కి చెప్పి…సినిమా తీయించుకున్నాడు.

అంతా బానే ఉంది కానీ, అతను చెప్పాలనుకున్న విజ్ఞప్తి ఏంటానేది తెలుసుకోవడానికి, సినిమా అంతా చూడాల్సిన అవసరం లేదు. సింపుల్ గా, క్లైమాక్స్ లో.. ఎండ్ credits ముందు వచ్చే.. 1 మినిట్ డైలాగ్ చాలు.. అది చెప్పడానికి.. 2 గంటలు టైమ్, 258రూపాయలు టికెట్, 20రూపాయలు పార్కింగ్ ఛార్జ్ తీసుకున్నారు. అదేదో యూట్యూబ్ లోనో, podcast లోనో చెప్పేస్తే సరిపోయేది!

చివరగా…

సినిమా రెండు గంటలే! కానీ ఏదో మూడు గంటల సినిమా చూసినట్టు ఉంటుంది.కిషోర్ తిరుమల లోని రచయిత ను, రవితేజ సరిగ్గా జడ్జ్ చేయలేకపోయారు అనిపించింది. ఇంకో రెండు రోజులు కూర్చుని.. screenplay, దర్శకత్వం మీద దృష్టి సారిస్తే, కనీసం చూడటానికి అయినా బాగుండేది. రెండో సగంలో వచ్చే DJ mix ఏమీ కొత్త ప్రయోగం కాదు. రవితేజ energy మిస్ అయ్యింది సినిమా అంతా. నీరసంగా ఉండే రవితేజ ను ఎవరూ చూడాలని థియేటర్ కి రారు. ఇంకా క్లైమాక్స్ ఎలా ముగించాలో తెలియక.. కిషోర్ తిరుమల రాసిన సీన్.. అబ్బో! బయట టాక్ బానే ఉంది. చూస్తాను అనుకుంటే, ఒకసారి అలా అలా చూడటానికి ఒకే. కానీ ఇదేమీ కొత్త కథ కాదు. కొత్త నటనలు కావు!

I am rating this movie with 2.25/5

4.9/5 - (11 votes)

మన శంకర వర ప్రసాద్ గారు (2026)  మా చిరంజీవి లోని, నటుడ్ని మరలా ఆయనకి, మాకు పరిచయం చేసినందుకు.. ప్రత్యేక ధన్యవాదాలు అనిల్..

సింపుల్ గా :  కామెడీ టైమింగ్ అనగానే గుర్తొచ్చే హీరో కి, కామెడీ రాయడంలో phD చేసిన దర్శకుడు తోడు అయితే…. అదిరిపొద్ది సంక్రాంతి!

Comedy. Cringe & Anil Ravipudi

కామెడీ వ్రాయడం చాలా కష్టం. ఎందుకంటే, నాకు నవ్వొచ్చిన సందర్భం వేరే వాడికి సిల్లీ గా అనిపించొచ్చు! అప్పట్లో జోక్ కి నవ్వు రాకపోతే, కుళ్ళు కామెడీ అనేవారు..ఇప్పుడు cringe అంటున్నారు.. నవ్వించడం చేతకాని వాడే, cringe అంటూ, నవ్వించే ప్రయత్నం చేస్తాడు! Entertainment అనేది వ్రాసి, తీసి, confident గా జనాల ముందు ఉంచడం.. కొందరికే సాధ్యం! అందులో పరిణీతి చెందాడు అనిల్! 

ప్రతి పండుగకి, సినిమా విడుదల చేస్తూ.. తన పేరు మీద ఉన్న ఎంటర్టైన్మెంట్ మీటర్ కి ఎప్పటికప్పుడు సవాళ్లు విసురుతూ.. ఎదుగుతూనే ఉన్నాడు అనిల్ రావిపూడి!

ఇది కొన్ని సార్లు కుళ్ళు కామెడీ అనిపిస్తే, కొన్ని సార్లు భలే రాశాడబ్బా.. అనుకునేలా చేసే magician Anil. “మన శంకర వర ప్రసాద్ గారు” లో అనిల్ రాసుకున్న, ఎపిసోడ్స్ బాగున్నాయి! ముఖ్యంగా మొదటి భాగం! First half అయ్యేక బయటికి వచ్చి, చిరంజీవి కామెడీ టైమింగ్ ను పొగిడే ప్రతి అభిమాని , అనిల్ రావిపూడి ను ఆకాశం కు ఎత్తేస్తారు. మా చిరంజీవి లోని, నటుడ్ని మరలా ఆయనకి, మాకు పరిచయం చేసినందుకు.. ప్రత్యేక ధన్యవాదాలు అనిల్..

Star Starrrr.. Mega Starrr

చిరంజీవి ను చూస్తే, కమల్ హాసన్ , రజనీకాంత్ , శివాజీ గణేషన్ ను కలిపి చూసినట్టు ఉంటుంది అని , దిగ్గజ దర్శకులు KV బాల చందర్ గారు అన్నారు ఒక్క సందర్భంగా! Bigger than Bachchan అని నేషనల్ మీడియా రాసుకుంటూ వచ్చినా, 1980-1990 మధ్య పుట్టిన వారిలో , ఎంతో మందికి ఆదర్శంగా నిలిచినా, చిరంజీవి అంటే.. ఈ తరానికి.. insta memes మాత్రమే! మీకేమి తెలుసు రా చిరంజీవి నటన అండ్ కామెడీ అని చెప్పాలని అనుకున్నా, సరైన సినిమాలు కుదరక.. ప్రతి అభిమాని మూగబోయే వాడు!

చిరంజీవి కామెడీ టైమింగ్ అద్భుతం. ఒక చంటబ్బాయి! ఒక్క ఘరానా మొగుడు.. ఒక అన్నయ్య.. ఒక శంకర్ దాదా.. ఒక్క మన శంకర వర ప్రసాద్ గారు! బాస్, మీరు ఇలానే క్వాలిటీ ఉన్న డైరెక్టర్స్ తో తియ్యండి! మీ ఎనర్జీ, మాకు stress reliever. మీరు ఇచ్చే ఎంటర్టైన్మెంట్, తెలుగు సినిమా కి ఆక్సిజన్!

చివరగా…

సినిమాలో, అనిల్ రావిపూడి రాసుకున్న కామెడీ లైన్స్ కి, మెగాస్టార్ నటన తోడు అయ్యి, మొదటి భాగం పిచ్చి high ఇస్తుంది.. చిరంజీవి లో మిస్ అయ్యిన humour, చిలిపి చేష్టలు, ఈ సినిమాలో మళ్ళీ మనము చూసే అవకాశం వచ్చింది. రెండవ సగం(సెకండ్ హాఫ్) కొద్దిగా స్లో అయ్యింది. అంటే బాలేనట్టు కాదు. మొదటి సగం ఇచ్చిన ఎనర్జీ ఇవ్వలేకపోయింది. వెంకటేష్, చిరంజీవి కాంబినేషన్ సీన్స్ బాగున్నాయి.

ప్రతి 80s, 90s కిడ్స్, తమ పిల్లలకి లేక తర్వాతి తరానికి, చిరంజీవి కోసం చెప్పాలి.. పరిచయం చేయాలి అనుకుంటారు. ఇన్నాళ్లు సరైన సినిమాలు పడలేదు.

“మన శంకర వర ప్రసాద్ గారు ”  will definitely introduce Chiranjeevi to this Generation. And his comedy timing has been rediscovered by ANIL RAVIPUDI.

నేను అయితే, కచ్చితంగా.. చిరంజీవి ఫ్యాన్స్ గా మారబోయే తర్వాతి తరానికి ముందే ఆనందంతో, ఈ fandom కు welcome చెప్తున్నాను!

I am rating this movie with 3/5

4.7/5 - (23 votes)

రాజా సాబ్ (2026): మారుతి సాబ్. వద్దు సాబ్!

Psychological Thriller ఎలా తీసాడు అబ్బా మారుతి అని సందేహ పడాలో, ప్రభాస్ filmography లో, మరొక్క కొత్త కథ.. కొత్త genre అని సంబర పడాలో తెలియని సిట్యుయేషన్!

ఈ సినిమా అర్ధం కానీ వారికి, నేను సింపుల్ గా వివరించే ప్రయత్నం చేశాను ఈ రివ్యూ లో!

ఇది హారర్ అన్నారు.. హారర్ ఫాంటసీ అన్నారు.. ఇప్పుడు ఏంటి మీరు psychological thriller అంటున్నారు అనే కదా?

ఈ సినిమాలో, సంజయ్ దత్ పాత్ర కి Hypnotism ( బ్రెయిన్ కంట్రోల్ చేయడం) , Hallucinations (బ్రెయిన్ లో ఫాల్స్ /ఫేక్ ప్రపంచం సృష్టించడం) లాంటి విద్యలు తెలుసు.. ఆ శక్తితో, ప్రభాస్ ను ఎలా ఇబ్బంది పెట్టాడు అనేదే ఈ సినిమా కథ!

ముందుగా, తన మైండ్ లోకి ట్రాప్ చేసి, అందరిని హిప్నాటిజం చేయడం, లేకపోతే ఫేక్ scenario క్రియేట్ చేసి, జనాల్ని బయటపెట్టి, వాళ్ళ నుంచి, సంజయ్ దత్ తనకి కావాల్సింది చేసుకోడం ఈ సినిమా మెయిన్ థీమ్. ఇంత చక్కని psychological story ను , దర్శకుడు మారుతి నడిపించిన విధానం, రాసుకున్న screenplay బహుశా తెలుగు సినిమాల్లో, అత్యంత పేలవం మరియు నాసిరకం అన్నోచు! రాజా సాబ్ కన్నా చెత్త సినిమాలు చాలానే ఉన్నాయి, కానీ వాటిలో ఇటువంటి unique elements లేవు.. చేజేతులా , మంచి కథాంశం ను, అక్కర్లేని గ్లామర్ , పస లేని కామెడీ, చిరాకు తెప్పించే డైలాగ్స్ తో సమకూర్చి, చికాకు ను సింపుల్ గా 3 గంటలు పాటు అందించాడు మారుతి.

ప్రభాస్ నటన బాగుంది. పాన్ ఇండియా అంటూ , ప్రభాస్ లో మిస్ అయ్యిన, freeflow ఈ సినిమాలో కాస్త కనిపించింది. ఇంకా లుక్స్ విషయంలోనే అసలు సమస్య! ప్రభాస్ అంతటి అందగాడు ఇండియా సినిమా ఇండస్ట్రీలోనే ఉండేవాడు కాదు. కానీ, సినిమా సినిమాకి ప్రభాస్ స్టైలింగ్ చూస్తుంటే, ఏదీ శాశ్వతం కాదు అనిపించకమానదు.

తమన్ సినిమాలో సంగీతం ఇవ్వడం మానేసి, అలా తన దగ్గర ఉన్న అన్ని instruments మీద తలొచెయ్యి వేసి, నచ్చినట్టు కొట్టేశాడు. లిరిక్స్ వినబడవు. Mixing బాలేదు.

ఇక, హీరోయిన్స్! గ్లామర్ షో బాగా చేసినప్పటికీ, నటన ప్రభావం లేని పాత్రలు కావడంతో, పెద్దగా ఆకట్టుకోలేకపోయారు!

చివరగా..

మహేష్ బాబు – సుకుమార్ నటించిన ” 1 నేనొక్కడినే” కోసం ఇప్పటికీ అభిమానులు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఆ సినిమా ట్రైలర్ బాగా కట్ చేసి, జనాల్ని ప్రిపేర్ చేసుంటే, థియేటర్స్ కి వచ్చిన ప్రేక్షకుడు ముందే రెడీ అయ్యేవాడు అని చాలా సందర్భాల్లో ఆ సినిమా నిర్మాతలు చెప్పారు. సుమారు 12 ఏళ్ల తర్వాత , అటువంటి థీమ్ తో వచ్చిన రాజా సాబ్ కి ఇదే మేజర్ ఇబ్బంది.

ప్రేక్షకుడిని సిద్ధం చేయడంలో ప్రమోషనల్ కంటెంట్ విఫలం అయ్యింది. ఈ సినిమాలో psychological కాన్సెప్ట్ కు కావలసినంత weightage ఇవ్వకపోవడంతో, చివర్లో వచ్చే climax మరీ పేలవంగా ఉంది. మాములుగా చూస్తే, సంజయ్ దత్ ఇచ్చిన చిక్కు నుంచి, ప్రభాస్ బయటపడే సీన్స్ కి విజిల్స్ పడాలి. అంత స్కోప్ ఉంది కూడా ఆ సన్నివేశం కి.. కానీ ఆ కాన్సెప్ట్ కోసం దర్శక రచయితలు ఎక్కువ సేపు మాట్లాడకపోవడం, జనాలకి అర్ధం అయ్యేవిధనంలో చెప్పకపోవడం, ఇంగ్లీష్ terms ఎక్కువ అవ్వడంతో.. ఈ సినిమా గతి, స్థితి ,పరిస్థితి..అగమ్య గోచరం గా మిగిలింది.

నేను పెద్దగా ఎంజాయ్ చేసిన సీన్స్ ఏమి లేదు.. హిప్నాటిజం, Hallucinations concept బాగుంది. కొంచెం వర్క్ చేసుంటే, భలే ఉండేది ఏమో రాజా సాబ్.. ప్రస్తుతానికి మాత్రం,” వద్దు సాబ్ ” అనిపిస్తుంది.!

I’m rating this movie with 1.5/5

4.3/5 - (20 votes)

అఖండ 2 : తాండవం : ఏం వాడకం అయ్యా!

ఒకరమైన స్పైడర్ కుట్టడంవల్లన Peter Parker స్పైడర్ మ్యాన్ గా మారినట్టు, తన ప్లానెట్ నుంచి భూమి మీదకి సూపర్ పవర్స్ తో వచ్చి, కెంట్ క్లార్క్ సూపర్ మ్యాన్ గా మారినట్టు.. ఈ సినిమాలో..  బాలయ్య.. శివుడి గణం వలన.. Hyper Super Heavy Skilled war machine గా మారి.. సెకండ్ హాఫ్ లో చేసిన రచ్చ అంత ఇంత కాదు. అయితే, అది మరీ పరిధి మించి ఉండటమే ఇక్కడ ఇబ్బంది.

ఏముంది సెకండ్ హాఫ్ లో..

ఎనర్జీ ఉంది. ఫిజిక్స్ ను తలకిందులు చేసే స్టంట్ ఉన్నాయి.. ముఖ్యంగా, శివుడి ఉగ్రరూపం బాలయ్య లా కనిపించి, చేసిన రచ్చ, అఖండ పార్ట్ 1 లో సగమే చూస్తే, ఇందులో ఫుల్ లెంగ్త్ సినిమా లా చూపించాడు బోయపాటి శ్రీను.

ప్రతి క్యారెక్టర్ హైపర్ గా రియాక్ట్ అవ్వడం, అక్కడ నుంచి సీన్స్ బిల్డ్ చెయ్యడం.. బోయపాటి కి కొట్టిన పిండి. అతని స్టైల్ ఆఫ్ మేకింగ్, ఇండియా లోనే ఎవరూ ప్రయత్నించలేరు. సినిమా సినిమాకి, బోయపాటి.. యాక్షన్ ను ఓవర్ ది టాప్ చేయడం వలన, విమర్శకులు చేతికి చిక్కినట్టు అవుతోంది.

అఖండ గా బాలయ్య బాబు నటన అద్భుతం! బాలయ్య అంటేనే లాజిక్ లేని ఫైట్స్. పేజీ పేజీలు డైలాగ్స్. ఇందులో, బాలయ్య ద్వారా, సనాతన ధర్మం మరియు దాని ప్రభావం చెప్పే ప్రయత్నం బాగుంది. కానీ, కొంచెం పరిధి దాటిన యాక్షన్ వలన, అవేమి చివరికి గుర్తు ఉండవు, ప్రేక్షకుడు కి.!

సింపుల్ గా…

జై బాలయ్య అంటూ థియేటర్ లోకి అడుగు పెట్టిన ప్రేక్షకుడు ఏమి కోరుకుంటాడో, అదే వడ్డించాడు బోయపాటి! ఇంటర్వెల్ నుంచి సెకండ్ హాఫ్ అంతా, క్లైమాక్స్ తో కలుపుకుని, MLA బాల మురళి కృష్ణ పాత్ర 30 సెకండ్స్ కూడా లేకపోవడం పెద్ద ప్లస్. సినిమా అంతా, శివుడు trance లోకి తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేశారు టీమ్. తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాలేదు. బాలయ్య స్క్రీన్ మీద చేస్తున యాక్షన్ ను, తారా స్థాయికి తీసుకుని వెళ్ళడంలో తమన్ విఫలం అయ్యాడు! (బహుశా ఇది మొదటిసారి ఏమో!)

శివుడు వచ్చి చితికి నిప్పు పెట్టడం, బాలయ్య – ఆది పినిశెట్టి మధ్య వచ్చే సన్నివేశం, దేవుడు లేడు అనే సిట్యుయేషన్ కి తీసుకుని వచ్చి, జనాలు కి బాలయ్య హితబోధ చేయడం లాంటివి బాగున్నాయి.

చివరిగా..

స్క్రీన్ మీద ఉన్నది శివుడు అని చూస్తే, సినిమా మీకు పర్వాలేదు అనిపించే అవకాశం ఉంది. బోయపాటి శివుడ్ని ఈ రేంజ్ లో వాడుకున్నాడా అనిపించి, ఆ ట్రాన్స్ లో కొంచెం పాజిటివ్ గా బయటకి వస్తారు.. ఎందుకంటే దేవుడు ఏమైనా చెయ్యగలడు ! Anti gravity షాట్స్ అన్నీ దేవుడు మాయలో కొట్టుకుని వెళ్ళిపోతాయి!

అదే స్క్రీన్ మీద ఉన్నది బాలయ్య అని చూస్తే, ఇంకెప్పుడు రా తెలుగు సినిమా మారేది అనుకుంటూ, బోయపాటి ని కూడా కొంచెం తిట్టుకుంటూ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు..

నేను అయితే, సినిమా లో శివుడి కి , శివ తత్వం కి కనెక్ట్ అవ్వడం వల్లన, నాకు పరవాలేదు అనిపించింది.

I’m rating this movie with 2.5/5

4.5/5 - (19 votes)

కాంత (2025) : మొదటి భాగం  సినిమా. రెండో భాగం  మిస్టరీ. అయినా, కష్టంగానే చూడాలి!

నాకు ఎదైన సినిమాలో, సినిమా ప్రపంచం పరిచయం చేసి, సినిమా కోసం మాట్లాడితే , ఎంతో ఆసక్తి గా చూస్తాను. అలానే, ” కాంత” ట్రైలర్ చూసి, సినిమా కోసం బాగా వెయిట్ చేసాను. దాదాపు ఒక్క నెల తర్వాత, థియేటర్ లో చూసిన సినిమా ఇది. (Oct 19, 2O25 తర్వాత, థియేటర్ లో చూసిన సినిమా ఇదే!)

సినిమాలో సినిమా!

తొలినాట సినిమా ప్రపంచం, తెర మీద కష్టం.. తెర వెనుక అహంకారం. ఇలా మొదటి భాగం అంతా, సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకుడు కి,  ఒక్క చక్కని సినిమా ప్రపంచం చూపించి బాగానే అలరించారు దుల్కర్, సముద్రఖని, భాగ్య శ్రీ! సినిమా అనే మాయ ప్రపంచం లో ఇన్ని కోణాలు ఉంటాయి అని, యంగ్ మైండ్స్ కి చూపించే ప్రయత్నం బాగుంది. ఈ సినిమా మొదటి భాగం చూసి, జీవితంలో ఏమి అవ్వాలో ఇంకా నిర్ణయం తీసుకోని వారు ఎవరైనా, ఆ ట్రాన్స్ లో దర్శకుడు లేదా కథానాయకుడు అవుదాం అనుకుంటారు. సినిమా మీద ఇష్టం ఉన్న వారు ఇంకాస్త ఎక్కువగా సినిమా ప్రపంచం మీద మక్కువ తెచ్చుకుంటారు. అంత బాగుంది మరి మొదటి భాగం!

రెండో భాగం కి ఏమైంది?

మొదటి భాగం చూసి , బాగానే సినిమా మాయలో పడిన ప్రేక్షకుడు కి, ఇంటర్వెల్ లో వచ్చే సన్నివేశం , రెండో భాగం వైపు ఆసక్తిగా ఎదురు చూసేలా చేస్తుంది. రెండో భాగం కూడా, సినిమా రాజకీయం ఉంటుంది అనుకునే వాడికి.. దర్శకుడు తియ్యనైన షాక్ తో, ఇంటరాగేషన్ అంటూ మొదలు పెడతారు. అక్కడ మొదలు అవుతుంది అస్సలు సమస్య! ఎన్ని సార్లు  తీసినా, మర్డర్ మిస్టరీ కోణం ఎప్పుడూ బాగానే ఉంటుంది. పైగా సినిమా సెట్లో మర్డర్ అంటే, ఇంకేం ఉంది? కానీ.. అక్కడ నుంచి సినిమా షిఫ్ట్ అయ్యిన తీరు. పాత్రలు చుట్టూ అల్లుకునే డ్రామా, ఏమాత్రం సంబంధం లేకుండా ఉంటాయి!

మొదటి గంట ఏమి చూసామో, చివరి గంట ఏమి చూస్తున్నామో, డిసైడ్ కాలేక , థియేటర్ కి వచ్చిన  ,ప్రేక్షకుడు నిరుత్సాహం పడటం కనిపించింది. రానా కి ఏమైంది? తన నటన మితి మీరి ఉండటంతో పాటు, ఓవర్ ది బోర్డు ఎమోషన్స్ తో కథని అక్కడ అక్కడే తిప్పుతూ, మొదటి భాగం ఇచ్చిన అనుభూతి నీ చెరిపేస్తారు .

చివరగా..

విడి విడిగా చూస్తే, సినిమా ప్రపంచం ఒక్క ఆలోచన. మర్డర్ మిస్టరీ ఒక్క ఆలోచన. సినిమా సెట్ లో మర్డర్ మిస్టరీ అనేది కొత్త ఆలోచనే! (అగస్టా క్రిస్టీ నవలలు ఆధారంగా వచ్చిన సినిమాలు లోనూ ఇలాంటి వింత మిస్టరీస్ ఉంటాయి). దర్శకుడి ఆలోచన కి సరిపోయే స్క్రీన్ ప్లే, సంభాషణలు లేకపోవడం, పాత్రలు నడిచే తీరు పేలవంగా ఉండటంలో, రెండో భాగం ఈ సినిమాని కిందకి నెట్టేశాయి అనే చెప్పాలి.

నాకు అయితే, ఈ సినిమాలో, నటి భాగ్య శ్రీ పాత్ర బాగా నచ్చింది. ఆమె నటన అమోఘం! దుల్కర్ గురించి తెలిసిందే. ఎలాంటి పాత్రనైనా ఇట్టే పట్టేస్తాడు. అది సినిమా హీరో పాత్ర ఐతే మరీను..

నాకు ఈ సినిమా మొదటి భాగం బాగా నచ్చింది. సినిమా ప్రపంచం, అక్కడి సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి.

నేను ఈ సినిమాకి 2.25/5 ఇస్తున్నాను!

4.9/5 - (14 votes)

తెలుసు కదా (2025) : కమ్మనైన క్లారిటీ. పసందైన ప్రేమ. !

ఇదేమీ ట్రైలర్? చూస్తుంటే ఏదో బూతు సినిమా లాగ ఉంది!

ఈ సినిమాకి బయట ఉన్న టాక్, ట్రైలర్ చూసి, ఇదేదో బూతు సినిమా అనుకుంటే, పొరపాటే! సరే కదా అని సినిమా చూసాక కూడా, ఇది బూతు లానే అనిపిస్తే, ఈ రివ్యూ మీకు కాదు! అసలు, ఇలాంటి సినిమా నచ్చింది అని చెప్తేనే, జడ్జ్ చేస్తారు. ఆ జడ్జిమెంట్ కి కిలోమీటర్ దూరంలో మీరు ఉంటే, ఈ సినిమా లో మెచ్యూరిటీ, పాత్రలతో ఒక్కరికి ఒక్కరి క్లారిటీ మీకు నచ్చొచ్చు!

ప్రేమ.. పెళ్లి.. క్లారిటీ

పేరు మోసిన chef వరుణ్ (సిద్దు). తన మిత్రుడు అభి (వైవా హర్ష). వరుణ్ అనాధ అని, తనకి పెళ్ళి సంబంధాలు చూస్తూ ఉంటాడు అభి. ఆ ప్రక్రియలో వరుణ్, అంజలి (రాశి ఖన్నా) ఒక్కరికి ఒకరు పరిచయం అవుతారు. సహజంగా క్లారిటీ maintain చేసే వరుణ్, జీవితంలో ఏమి కావాలో, ఏమి చేయాలో ప్లాన్ చేసుకునే అంజలి , మాటలు.. పాటలు అయ్యేక పెళ్ళి చేసుకుని సుఖముగా కొత్త జీవితం స్టార్ట్ చేసే సమయంలో, డాక్టర్ రాగ (శ్రీనిధి) వీరి ఇద్దరి జీవితం లో ఎలాంటి డ్రామా తీసుకొచ్చింది అనేది కథ!

నువ్వు.. నేను.. ఒక్క పెద్ద ఇల్లు.. బయట రెండు కార్లు.. ఒక్క చిన్న పప్పీ.. మన పిల్లలు.

ఈ సినిమాను రచించి, దర్శకత్వం వహించింది.. ఒక్క మహిళ… నీరజ కోన! అమ్మాయిలు రాసుకునే కథల్లో,ప్రేమ పెళ్ళి…పిల్లలు.. పప్పీ లు ఇవన్నీ కమాన్. మొదటి 20 నిమిషాలు ఇలానే సాగింది కథ.. కానీ ఆ తర్వాత , నీరజ కోన,  తనలోని రచయితలోని , మెచ్యూరిటీ కు పదును పెడుతూ.. కథని నడిపించిన తీరు అద్భుతం.

అమ్మాయి సినిమా తీసారు కాబట్టీ, అబ్బాయిలు కి వ్యతిరేకం గా తీసి ఉంటారు అనుకోకండి! ఇందులో సిద్దు పాత్ర లోని క్లారిటీ.. అందులో dimensions, నాకు తెలిసి.. ఏ రచయిత కూడా హాండిల్ చెయ్యలేడు! సిద్దు పాత్ర కి కావాల్సిన క్లారిటీ ఇస్తూ, confusion మొత్తం ఇద్దరు హీరోయిన్లు కి ఉంచేసి, సినిమా ను భలే నడిపించారు నీరజ!

అయితే చూడాలా? టాక్ వేరేలా ఉంది!

హహ! టాక్ ది ఏముంది.మొదటిరోజు సినిమా చూసే వాడి expectations, mindset వేరేలా ఉండొచ్చు! మల్టీప్లెక్స్ ఆడియెన్స్ కి వీలు అయ్యేది వీకెండ్ లోనే! ఇది ప్యూర్ A సెంటర్.. మల్టీప్లెక్స్ ఆడియెన్స్ కోసం తీసిన సినిమా.! సిద్దు నటించిన Krishna and his leela.. థియేటర్ రిలీజ్ అయ్యుంటే, ఇలాంటి టాక్ తోనే నడిచేది!

సినిమాలో పాత్రలు కి నీరజ రాసుకున్న సంభాషణలు, పాత్రలు బిహేవ్ చేసే తీరు ఎంతో మందికి రిలేట్ చేసుకునే విధంగా ఉంటాయి.

” నువ్వు మీ అమ్మ ముందు కాకుండా వేరే అమ్మాయి ముందు కన్నీళ్ళు పెట్టుకుంటే అక్కడే నీ పతనం start అవుతుంది”

” చెంప పగులుతుంది అని ముందే చెప్తే, నొప్పి ఏమైనా తగ్గుతుందా? “

“love Your style bro” అని ఆకాశం వైపు చూస్తూ సిద్దు పాత్ర చెప్పే డైలాగ్.. ఇలా ఎన్నో రెగ్యులర్ సంభాషణలు ల కాకుండా, ఆలోచింప చేసేవి చాలానే ఉన్నాయి!

వైవా హర్ష పాత్ర బాగుంది. తమన్ సంగీతం అలరిస్తుంది!

చివరిగా… 

అనురాగ్ బసు తీసిన,” లైఫ్ ఇన్ మెట్రో ” చూసి.. మన తెలుగు వాళ్ళు ఎందుకు, జీవితం కి, ప్రేమకి కొత్త గ్రామర్ ఇచ్చే పాత్రలు రాయరు అనుకునే వాడ్ని. బహుశా రాసినా, accept చేసే విజ్ఞత, digest చేసుకునే మెచ్యూరిటీ ఈ తరం కి లేదు అనుకున్నారు ఏమో! EVV సత్యనారాయణ గారి ” ఇంట్లో ఇల్లాలు.. వంటింట్లో ప్రియురాలు “రిలీజ్ అయినప్పుడు కూడా,  అప్పటి తరంలోను విపరీతంగా accept చేసిన వారు ఉండే ఉంటారు!

ఇది ఒక్క రివెంజ్ డ్రామా అన్నాడు సిద్దు. ప్రేమ ఉన్నప్పుడే రివెంజ్ కూడా ఉంటుంది. కంటెంట్ అయితే బోల్డ్ కాదు. కానీ పాత్రలు నడిచే తీరు మనం రెగ్యులర్ గా యాక్సెప్ట్ చేసేలా ఉండవు! అవి హాండిల్ చేసే emotional intelligence మీకు ఉంటే, ఈ సినిమా చూడండి! లేదంటే.. OTT వరకు వెయిట్ చేసి, అప్పుడు జడ్జ్ చెయ్యండి! నన్ను మాత్రమే కాదు. సినిమా ను కూడా. ఎందుకంటే….” తెలుసు కదా”

I’m rating this movie with 3/5.

4.9/5 - (7 votes)

Kantara – Chapter 1 (2025) : కొత్తగా ఏమిలేదు! అదే అరుపులు. అవే అడవి శక్తులు!


నటుడే దర్శకుడు అయితే:

నటుడు కి ఏమి కావాలో, అద్దంలో తనని తాను చూసుకునే నటుడు కే తెలుస్తుంది! తనలోని, ఆర్టిస్టిక్ ఈగో satisfaction కోసం, కొత్త కొత్త కథలు వెత్తుకుంటూ.. సరికొత్త భావాలు పలికించే ప్రయత్నాలు చేస్తుంటారు. అది, తనకి తానే దర్శకత్వం చేసుకున్నా, కమల్ హాసన్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ఉపేంద్ర అయినా, పృధ్వీరాజ్ సుకుమారన్ అయినా, రిషబ్ షెట్టి అయినా, ప్రయోగాలు చేయడానికి, వేరే దర్శకుడు కోసం వేచి చూడలేదు!

అదంతా సరే. ఇంతకీ ఈ కాంతారా ఎలా ఉంది?

హహ! కాంతార సినిమా కోసం చెప్పమంటే, దర్శకుడు గా మారిన నటుడు కోసం చెప్తున్నాడేంటి? అనే కదా మీరు అనుకుంటున్నారు? ఈ సినిమా కూడా అలానే చాలా వరకు నాన్ సింక్ లోనే ఉంది. తనలోని నటుడు కోసం, రిషబ్,తన చుట్టూ కథ అల్లుకుంటే, తన లోని దర్శకుడు నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు!అల్లరి చిల్లరగా ఆడుతూ పాడుతూ, పేలవమైన పాత్రలతో , కథని మొదటి భాగం వరకు తీసుకుని వచ్చాడు రిషబ్!

ఫస్ట్ హాఫ్ పెద్దగా ఏమి లేదు. వివిధ రకాల జంతువులు.. కట్టడాలు, వేషాలు ఇవన్నీ , పిల్లలకి నచ్చే అవకాశం ఉన్నా, వాటితో పాటు వచ్చే హాస్య సన్నివేశాలు, రెగ్యులర్ ఆడియెన్స్ కు , హాస్యంతో చిరాకు కూడా తెప్పిస్తాయి!

మాట్లాడుకోవాల్సిన రెండో భాగం:

2022 లో వచ్చిన  కాంతార చూసిన వారికి, ఆ సినిమా నచ్చిన వారికి ,  ఈ సెకండ్ హాఫ్ కొద్దిగా బాగుంది అనిపించవచ్చు.

అదే సినిమా చూసి, ఈ సినిమా లో అయినా, క్లైమాక్స్ ఒక్కటే కాకుండా, సినిమా అంతా బాగుంటుందేమో అని వచ్చినవారికి, కొంత నిరాశ తప్పదు! ఎక్కువ రేట్ పెట్టీ టికెట్ కొని, మళ్ళీ అదే సినిమా చూస్తున భావం రాకపోదు!

” గులిగా”ఎపిసోడ్ లో, రిషబ్ చేసిన నటన అద్భుతం! “రుక్మిణి వసంత్ “పాత్ర, చివర్లో ఒక్క  గంట సేపు, డిఫరెంట్ షేడ్స్ పలికిస్తూ, కాంతార రెండో భాగం కు కావాల్సిన డ్రామా పండిస్తుంది.

సరే. అదే సినిమా మళ్ళీ తీసారు అన్నారు! మరి క్లైమాక్స్ ఎలా ఉంది?

బాగుంది! అప్పటివరకు, సాగతీత, అర్థం లేని మాటలు, విసుగు తెప్పించే జోకులు తో వెళ్తున్న సినిమాని, రిషబ్ షెట్టి, మరలా క్లైమాక్స్ లో, తనదైన శైలిలో నటించి, స్క్రీన్ ప్లే లో వేగం పెంచుతూ, కొత్త పాత్రలు తీసుకుని వచ్చి, కాసింత రిలీఫ్ ఇచ్చే ప్రయత్నం చేశారు! ఈ చివరి 20 -25 నిమిషాలు, ప్రతి ఒక్కరూ (కెమెరా, సంగీతం, VFX) దర్శకుడి ఆలోచనకి, రూపం తీసుకుని వచ్చారు.

చివరగా..

కాంతార (2022) నుంచి దర్శకుడు ఏమి నేర్చుకోలేదు అనిపించింది. ఆ సినిమా విజయం కావడంలో, చివరి 10 నిమిషాలు కారణం అయితే, ఈ కాంతార (2025)నాకు  పెద్దగా నచ్చకపోవడానికి, అవే కారణాలు అయ్యాయి! Mystical/supernatutal డ్రామా ఇష్టబడే వారు ఒక్కసారి చూసి యావరేజ్ అనుకుంటారు! ఇంకేదో ఆశించి థియేటర్ లోకి అడుగు పెట్టినవారికి మాత్రం, ఒక్కింత నిరుత్సాహం తప్పదు!

I am rating this film with 2.5/5


మీకు సినిమా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి! మరియు ఈ రివ్యూ కి మీరు రేటింగ్ కూడా ఇవ్వొచ్చు! 🙂

4.7/5 - (16 votes)

They call him OG : ఆకలి మీద ఉన్న అభిమానులు కోసం, ఒక్క అభిమాని తీసిన సినిమా!

OG మరియు నా expectations :

హరిహర వీర మల్లు సినిమాకి వచ్చిన అభిమానులు, OG OG అంటూ అరుస్తూ ఉంటే, OG కూడా హరిహర వీర మల్లు లాగా అయిపోతే, ఏంటి పరిస్థితి అనుకున్నాను? Clearance sale లాగా బాకీ ఉండిపోయిన పవన్ కళ్యాణ్ సినిమాలు ఒక్కొకటి గా వస్తుండటం తో, నాకు OG మీద పెద్దగా ఆశలు ఏమి లేవు! ఎక్కడో నేను అమితంగా ఇష్టపడే కళ్యాణ్ , తన అభిమానులకి ఒక్క మంచి సినిమా ఇవ్వకపోడా అని నమ్మకంతో థియేటర్ లోకి అడుగు పెట్టాను!

నాకు బాగా నచ్చిన అంశం

సినిమా మొదటి ఫ్రేమ్ నుంచే, దర్శకుడు సుజీత్ తను అనుకున్న మాఫియా gangstar యూనివర్స్ లోకి తీసుకుని వెళ్ళిపోయాడు. ముఖ్యంగా, కళ్యాణ్ ను ప్రజెంట్ చేసిన తీరు అమోఘం! స్టోరీ తో పాటు, కళ్యాణ్ ను రెండు సార్లు ఇంట్రడ్యూస్ చేసిన విధానం బాగుంది. ఒక్కసారి animated కళ్యాణ్ హంగ్రీ చీత అంటూ వస్తే, ఒక్క 15 నిమిషాలు తర్వాత.. Katana పట్టుకుని, అసలైన కళ్యాణ్ మన ముందు ఉంటాడు.

సెకనుకోక తల తెగి పడేనే అనే పాట కి ధీటు గానే, కళ్యాణ్ Katana ను own చేసుకున్న విధానం, తన చుట్టూ అల్లుకున్న కథ కి, ఎంత కావాలో అంతే సమయం కనిపిస్తూ.. ఛాన్స్ దొరికిన ప్రతీసారీ, రక్తపాతమే లక్ష్యంగా కథని ముందుకు తీసుకుని వెళ్తూ.. ప్రతి అభిమాని ఆకలి తీరుస్తూ.. ఒక్క catalyst లా దూసుకుపోయాడు!

ఇక సినిమా ending లో వచ్చే, Japanese ఎపిసోడ్, సినిమకే హైలైట్. జాన్ విక్ స్టైల్ లో కళ్యాణ్ ను చూపించే ప్రయత్నం బాగుంది.

తమన్ విధ్వంసం

నాకు ఈ ఏడాది బాగా నచ్చిన సినిమాల్లో, డాకు మహారాజ్ ఒకటి. బాలయ్య విశ్వరూపం కు, నందమూరి తమన్ చేసిన డ్యూటీ ఇప్పటికీ గుర్తుంది.ఈ సినిమాకి, పవన్ కళ్యాణ్ అభిమానిలో ఒక్కడిని నేను అంటూ, స్క్రీన్ మీద కళ్యాణ్ ఫైట్స్ చేస్తుంటే, ఆ visuals ను next level కు తీసుకుని వెళ్ళిపోయాడు! తమన్ చేసిన విధ్వంసం, మంచి Dolby థియేటర్ లో చూస్తేనే అర్థం అవుతుంది. సినిమా సినిమాకి ప్రాణం పెట్టి, దర్శకుడు కన్నా, ఎక్కువుగా కష్టబడే వ్యక్తి తమన్. హ్యాట్సాఫ్ తమన్! ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్ ఆయనే!

సినిమాలో నాకు నచ్చని విషయాలు

అభిమాని కోసమే సినిమా ఇది. వేరే హీరో అభిమాని.. కళ్యాణ్ కి కనెక్ట్ కానీ వారికి, elevations కోసమే సినిమా తీసారా? అన్నట్టు ఉంటుంది. ఇంతా elevations, martial arts, gangstar డ్రామా ఉన్నప్పటికీ, సినిమాలో సరైన కథ లేకపోవడం.. రెండో భాగంలో డ్రామా ఎక్కువ అయ్యి, సినిమా పేస్ తగ్గడం.. పెద్ద మైనస్ గా మిగిలాయి. ప్రతి పావు గంట కి ఒక్కసారి కళ్యాణ్ ను స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేసినా, elevations రొటీన్ అయిపోవడం, సుజిత్ కి రచన అనుభవం లేకపోవడంతో  కొన్ని సన్నివేశాలు, అంత అంత మాత్రంగానే ఉంటాయి. మరీ పేలవంగా ఉన్నాయి అనను కానీ, ఇంకాస్త screenplay పైన శ్రద్ధ పెట్టుంటే, neutral ఆడియెన్స్ కూడా ఈ OG మ్యాజిక్ లో మునిగి తెరేవారు!

Final Take

ఇదేదో కొత్త కథ కాదు. మనకి తెలియని screenplay లేదు. సుజిత్ క్రియేట్ చేసిన ఈ యూనివర్స్ లో, కళ్యాణ్ కొత్తగా కనిపించాడు. అభిమాని కోరుకునే హై ఎపిసోడ్స్ ఎన్నో! కెమెరా విభాగం బాగుంది. మిగతా ఆర్టిస్ట్స్ తమ పరిధి మేర బానే నటించారు!

Political గా వేరే సిద్ధాంతాలు ఉన్న కళ్యాణ్ అండ్ ప్రకాశ్ రాజ్.. సినిమాలో మాత్రం అందుకు విభన్నంగా, చాలా చక్కగా కలిసి నటించారు. అందుకే సినిమా ఒక్క మాయ అంటారు ఏమో!

నాకు ఐతే, బానే నచ్చింది. యాక్షన్ ను ఇష్టబడే వారు ఒక్కసారి హాయిగా చూసేయొచ్చు!

ఈ సినిమాకి నేను 3/5 ఇస్తున్నాను!

4.7/5 - (37 votes)