ఒకరమైన స్పైడర్ కుట్టడంవల్లన Peter Parker స్పైడర్ మ్యాన్ గా మారినట్టు, తన ప్లానెట్ నుంచి భూమి మీదకి సూపర్ పవర్స్ తో వచ్చి, కెంట్ క్లార్క్ సూపర్ మ్యాన్ గా మారినట్టు.. ఈ సినిమాలో.. బాలయ్య.. శివుడి గణం వలన.. Hyper Super Heavy Skilled war machine గా మారి.. సెకండ్ హాఫ్ లో చేసిన రచ్చ అంత ఇంత కాదు. అయితే, అది మరీ పరిధి మించి ఉండటమే ఇక్కడ ఇబ్బంది.
ఏముంది సెకండ్ హాఫ్ లో..
ఎనర్జీ ఉంది. ఫిజిక్స్ ను తలకిందులు చేసే స్టంట్ ఉన్నాయి.. ముఖ్యంగా, శివుడి ఉగ్రరూపం బాలయ్య లా కనిపించి, చేసిన రచ్చ, అఖండ పార్ట్ 1 లో సగమే చూస్తే, ఇందులో ఫుల్ లెంగ్త్ సినిమా లా చూపించాడు బోయపాటి శ్రీను.
ప్రతి క్యారెక్టర్ హైపర్ గా రియాక్ట్ అవ్వడం, అక్కడ నుంచి సీన్స్ బిల్డ్ చెయ్యడం.. బోయపాటి కి కొట్టిన పిండి. అతని స్టైల్ ఆఫ్ మేకింగ్, ఇండియా లోనే ఎవరూ ప్రయత్నించలేరు. సినిమా సినిమాకి, బోయపాటి.. యాక్షన్ ను ఓవర్ ది టాప్ చేయడం వలన, విమర్శకులు చేతికి చిక్కినట్టు అవుతోంది.
అఖండ గా బాలయ్య బాబు నటన అద్భుతం! బాలయ్య అంటేనే లాజిక్ లేని ఫైట్స్. పేజీ పేజీలు డైలాగ్స్. ఇందులో, బాలయ్య ద్వారా, సనాతన ధర్మం మరియు దాని ప్రభావం చెప్పే ప్రయత్నం బాగుంది. కానీ, కొంచెం పరిధి దాటిన యాక్షన్ వలన, అవేమి చివరికి గుర్తు ఉండవు, ప్రేక్షకుడు కి.!
సింపుల్ గా…
జై బాలయ్య అంటూ థియేటర్ లోకి అడుగు పెట్టిన ప్రేక్షకుడు ఏమి కోరుకుంటాడో, అదే వడ్డించాడు బోయపాటి! ఇంటర్వెల్ నుంచి సెకండ్ హాఫ్ అంతా, క్లైమాక్స్ తో కలుపుకుని, MLA బాల మురళి కృష్ణ పాత్ర 30 సెకండ్స్ కూడా లేకపోవడం పెద్ద ప్లస్. సినిమా అంతా, శివుడు trance లోకి తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేశారు టీమ్. తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాలేదు. బాలయ్య స్క్రీన్ మీద చేస్తున యాక్షన్ ను, తారా స్థాయికి తీసుకుని వెళ్ళడంలో తమన్ విఫలం అయ్యాడు! (బహుశా ఇది మొదటిసారి ఏమో!)
శివుడు వచ్చి చితికి నిప్పు పెట్టడం, బాలయ్య – ఆది పినిశెట్టి మధ్య వచ్చే సన్నివేశం, దేవుడు లేడు అనే సిట్యుయేషన్ కి తీసుకుని వచ్చి, జనాలు కి బాలయ్య హితబోధ చేయడం లాంటివి బాగున్నాయి.
చివరిగా..
స్క్రీన్ మీద ఉన్నది శివుడు అని చూస్తే, సినిమా మీకు పర్వాలేదు అనిపించే అవకాశం ఉంది. బోయపాటి శివుడ్ని ఈ రేంజ్ లో వాడుకున్నాడా అనిపించి, ఆ ట్రాన్స్ లో కొంచెం పాజిటివ్ గా బయటకి వస్తారు.. ఎందుకంటే దేవుడు ఏమైనా చెయ్యగలడు ! Anti gravity షాట్స్ అన్నీ దేవుడు మాయలో కొట్టుకుని వెళ్ళిపోతాయి!
అదే స్క్రీన్ మీద ఉన్నది బాలయ్య అని చూస్తే, ఇంకెప్పుడు రా తెలుగు సినిమా మారేది అనుకుంటూ, బోయపాటి ని కూడా కొంచెం తిట్టుకుంటూ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు..
నేను అయితే, సినిమా లో శివుడి కి , శివ తత్వం కి కనెక్ట్ అవ్వడం వల్లన, నాకు పరవాలేదు అనిపించింది.
I’m rating this movie with 2.5/5
I have connected fully with Shiva trance. While actually Amma speaking to Shiva. I had literally had tears.
Thank you for the review sir, this successfully made my diehard Balayya family fans (specially got influenced by part 1) backup from booking urgently 😂
Satti gaadi review simple & clear ga vuntundi… Chusindhi cheppalsindi matrame chepthadu adhi Jai Balayya ayina Jai chiranjeevi ayina… 😍🙏
Movie bagundhi just one time watch
Review bane ichav gani , inthaki chudamantava vodhantavaaa 😂😂😂