తెలుసు కదా (2025) : కమ్మనైన క్లారిటీ. పసందైన ప్రేమ. !

ఇదేమీ ట్రైలర్? చూస్తుంటే ఏదో బూతు సినిమా లాగ ఉంది!

ఈ సినిమాకి బయట ఉన్న టాక్, ట్రైలర్ చూసి, ఇదేదో బూతు సినిమా అనుకుంటే, పొరపాటే! సరే కదా అని సినిమా చూసాక కూడా, ఇది బూతు లానే అనిపిస్తే, ఈ రివ్యూ మీకు కాదు! అసలు, ఇలాంటి సినిమా నచ్చింది అని చెప్తేనే, జడ్జ్ చేస్తారు. ఆ జడ్జిమెంట్ కి కిలోమీటర్ దూరంలో మీరు ఉంటే, ఈ సినిమా లో మెచ్యూరిటీ, పాత్రలతో ఒక్కరికి ఒక్కరి క్లారిటీ మీకు నచ్చొచ్చు!

ప్రేమ.. పెళ్లి.. క్లారిటీ

పేరు మోసిన chef వరుణ్ (సిద్దు). తన మిత్రుడు అభి (వైవా హర్ష). వరుణ్ అనాధ అని, తనకి పెళ్ళి సంబంధాలు చూస్తూ ఉంటాడు అభి. ఆ ప్రక్రియలో వరుణ్, అంజలి (రాశి ఖన్నా) ఒక్కరికి ఒకరు పరిచయం అవుతారు. సహజంగా క్లారిటీ maintain చేసే వరుణ్, జీవితంలో ఏమి కావాలో, ఏమి చేయాలో ప్లాన్ చేసుకునే అంజలి , మాటలు.. పాటలు అయ్యేక పెళ్ళి చేసుకుని సుఖముగా కొత్త జీవితం స్టార్ట్ చేసే సమయంలో, డాక్టర్ రాగ (శ్రీనిధి) వీరి ఇద్దరి జీవితం లో ఎలాంటి డ్రామా తీసుకొచ్చింది అనేది కథ!

నువ్వు.. నేను.. ఒక్క పెద్ద ఇల్లు.. బయట రెండు కార్లు.. ఒక్క చిన్న పప్పీ.. మన పిల్లలు.

ఈ సినిమాను రచించి, దర్శకత్వం వహించింది.. ఒక్క మహిళ… నీరజ కోన! అమ్మాయిలు రాసుకునే కథల్లో,ప్రేమ పెళ్ళి…పిల్లలు.. పప్పీ లు ఇవన్నీ కమాన్. మొదటి 20 నిమిషాలు ఇలానే సాగింది కథ.. కానీ ఆ తర్వాత , నీరజ కోన,  తనలోని రచయితలోని , మెచ్యూరిటీ కు పదును పెడుతూ.. కథని నడిపించిన తీరు అద్భుతం.

అమ్మాయి సినిమా తీసారు కాబట్టీ, అబ్బాయిలు కి వ్యతిరేకం గా తీసి ఉంటారు అనుకోకండి! ఇందులో సిద్దు పాత్ర లోని క్లారిటీ.. అందులో dimensions, నాకు తెలిసి.. ఏ రచయిత కూడా హాండిల్ చెయ్యలేడు! సిద్దు పాత్ర కి కావాల్సిన క్లారిటీ ఇస్తూ, confusion మొత్తం ఇద్దరు హీరోయిన్లు కి ఉంచేసి, సినిమా ను భలే నడిపించారు నీరజ!

అయితే చూడాలా? టాక్ వేరేలా ఉంది!

హహ! టాక్ ది ఏముంది.మొదటిరోజు సినిమా చూసే వాడి expectations, mindset వేరేలా ఉండొచ్చు! మల్టీప్లెక్స్ ఆడియెన్స్ కి వీలు అయ్యేది వీకెండ్ లోనే! ఇది ప్యూర్ A సెంటర్.. మల్టీప్లెక్స్ ఆడియెన్స్ కోసం తీసిన సినిమా.! సిద్దు నటించిన Krishna and his leela.. థియేటర్ రిలీజ్ అయ్యుంటే, ఇలాంటి టాక్ తోనే నడిచేది!

సినిమాలో పాత్రలు కి నీరజ రాసుకున్న సంభాషణలు, పాత్రలు బిహేవ్ చేసే తీరు ఎంతో మందికి రిలేట్ చేసుకునే విధంగా ఉంటాయి.

” నువ్వు మీ అమ్మ ముందు కాకుండా వేరే అమ్మాయి ముందు కన్నీళ్ళు పెట్టుకుంటే అక్కడే నీ పతనం start అవుతుంది”

” చెంప పగులుతుంది అని ముందే చెప్తే, నొప్పి ఏమైనా తగ్గుతుందా? “

“love Your style bro” అని ఆకాశం వైపు చూస్తూ సిద్దు పాత్ర చెప్పే డైలాగ్.. ఇలా ఎన్నో రెగ్యులర్ సంభాషణలు ల కాకుండా, ఆలోచింప చేసేవి చాలానే ఉన్నాయి!

వైవా హర్ష పాత్ర బాగుంది. తమన్ సంగీతం అలరిస్తుంది!

చివరిగా… 

అనురాగ్ బసు తీసిన,” లైఫ్ ఇన్ మెట్రో ” చూసి.. మన తెలుగు వాళ్ళు ఎందుకు, జీవితం కి, ప్రేమకి కొత్త గ్రామర్ ఇచ్చే పాత్రలు రాయరు అనుకునే వాడ్ని. బహుశా రాసినా, accept చేసే విజ్ఞత, digest చేసుకునే మెచ్యూరిటీ ఈ తరం కి లేదు అనుకున్నారు ఏమో! EVV సత్యనారాయణ గారి ” ఇంట్లో ఇల్లాలు.. వంటింట్లో ప్రియురాలు “రిలీజ్ అయినప్పుడు కూడా,  అప్పటి తరంలోను విపరీతంగా accept చేసిన వారు ఉండే ఉంటారు!

ఇది ఒక్క రివెంజ్ డ్రామా అన్నాడు సిద్దు. ప్రేమ ఉన్నప్పుడే రివెంజ్ కూడా ఉంటుంది. కంటెంట్ అయితే బోల్డ్ కాదు. కానీ పాత్రలు నడిచే తీరు మనం రెగ్యులర్ గా యాక్సెప్ట్ చేసేలా ఉండవు! అవి హాండిల్ చేసే emotional intelligence మీకు ఉంటే, ఈ సినిమా చూడండి! లేదంటే.. OTT వరకు వెయిట్ చేసి, అప్పుడు జడ్జ్ చెయ్యండి! నన్ను మాత్రమే కాదు. సినిమా ను కూడా. ఎందుకంటే….” తెలుసు కదా”

I’m rating this movie with 3/5.

4.9/5 - (7 votes)

3 thoughts on “తెలుసు కదా (2025) : కమ్మనైన క్లారిటీ. పసందైన ప్రేమ. !”

  1. నేను ఇప్పుడే ఈ సినిమా చూసి వచ్చా నా భార్యతో..
    మన సత్య @సత్తి ఏదైతే రాశాడో అది అక్షరాలా నిజం. సగటు తెలుగు ప్రేక్షకులు కోరుకునే..ఫైట్లు, భారీ డైలాగులు, మాస్ ఎలివేషన్లు లేనప్పటికీ, ఆద్యంతం అలరించింది మమ్మల్ని..

    రొటీన్ సినిమాలు చూసి చూసి బోరు కొట్టిన నాకు, ఈ సినిమా తీసిన విధానం బాగా నచ్చింది..
    రొటీన్ ఫార్ములా లేకుండా తీశారు అంటున్నారు, ఇదేమైనా ఆర్టు స్టైల్ సినిమానా అనుకుంటారేమో,
    అచ్చ తెలుగు వినోదాత్మక చిత్రం..

    ఒక కాస్ట్యూమ్ డిజైనర్ దర్శకులుగా మారి సినిమాను తెరకెక్కిస్తే ఎంత అందంగా నటీ నటులను చూపించవచ్చో ‘నీరజ కోన’ గారు చూపించారు..

    అతి కొద్ది పాత్రలతో, అలరించే మాటలతో, అందమైన సన్నివేశాలతో, అద్భుతమైన మలుపులతో సాగి.. చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమా చూసిన అనుభూతి కలిగింది నాకు..

    తప్పక చూడాలనిపించే సినిమాల జాబితాలో తప్పకుండా చేర్చాల్సిన సినిమా అని నా అభిప్రాయం,
    వీడెవడండీ ఇంతలా మోసేస్తున్నాడు సినిమాను అంటారా.. మన తెలుగు సినీ చరిత్రలో ఉన్న గొప్ప గొప్ప సినీ రచయితలు, దర్శకుల జాబితాలో మహిళలు ఉన్నారా అంటే టక్కున చెప్పడం కష్టమే..
    అందుకే అంటున్నా, ఇలాంటి మహిళా రచయిత, దర్శకులను ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనకు, లేదంటే..ఎప్పుడూ చూసే రొడ్డ కొట్టుడు ఫార్ములాలతో ఉండే సినిమాలే మనకు దిక్కవుతాయని మీకు ‘తెలుసు కదా’..!

    Reply

Leave a Reply to saitalkscinema@gmail.com Cancel reply