మన శంకర వర ప్రసాద్ గారు (2026)  మా చిరంజీవి లోని, నటుడ్ని మరలా ఆయనకి, మాకు పరిచయం చేసినందుకు.. ప్రత్యేక ధన్యవాదాలు అనిల్..

సింపుల్ గా :  కామెడీ టైమింగ్ అనగానే గుర్తొచ్చే హీరో కి, కామెడీ రాయడంలో phD చేసిన దర్శకుడు తోడు అయితే…. అదిరిపొద్ది సంక్రాంతి!

Comedy. Cringe & Anil Ravipudi

కామెడీ వ్రాయడం చాలా కష్టం. ఎందుకంటే, నాకు నవ్వొచ్చిన సందర్భం వేరే వాడికి సిల్లీ గా అనిపించొచ్చు! అప్పట్లో జోక్ కి నవ్వు రాకపోతే, కుళ్ళు కామెడీ అనేవారు..ఇప్పుడు cringe అంటున్నారు.. నవ్వించడం చేతకాని వాడే, cringe అంటూ, నవ్వించే ప్రయత్నం చేస్తాడు! Entertainment అనేది వ్రాసి, తీసి, confident గా జనాల ముందు ఉంచడం.. కొందరికే సాధ్యం! అందులో పరిణీతి చెందాడు అనిల్! 

ప్రతి పండుగకి, సినిమా విడుదల చేస్తూ.. తన పేరు మీద ఉన్న ఎంటర్టైన్మెంట్ మీటర్ కి ఎప్పటికప్పుడు సవాళ్లు విసురుతూ.. ఎదుగుతూనే ఉన్నాడు అనిల్ రావిపూడి!

ఇది కొన్ని సార్లు కుళ్ళు కామెడీ అనిపిస్తే, కొన్ని సార్లు భలే రాశాడబ్బా.. అనుకునేలా చేసే magician Anil. “మన శంకర వర ప్రసాద్ గారు” లో అనిల్ రాసుకున్న, ఎపిసోడ్స్ బాగున్నాయి! ముఖ్యంగా మొదటి భాగం! First half అయ్యేక బయటికి వచ్చి, చిరంజీవి కామెడీ టైమింగ్ ను పొగిడే ప్రతి అభిమాని , అనిల్ రావిపూడి ను ఆకాశం కు ఎత్తేస్తారు. మా చిరంజీవి లోని, నటుడ్ని మరలా ఆయనకి, మాకు పరిచయం చేసినందుకు.. ప్రత్యేక ధన్యవాదాలు అనిల్..

Star Starrrr.. Mega Starrr

చిరంజీవి ను చూస్తే, కమల్ హాసన్ , రజనీకాంత్ , శివాజీ గణేషన్ ను కలిపి చూసినట్టు ఉంటుంది అని , దిగ్గజ దర్శకులు KV బాల చందర్ గారు అన్నారు ఒక్క సందర్భంగా! Bigger than Bachchan అని నేషనల్ మీడియా రాసుకుంటూ వచ్చినా, 1980-1990 మధ్య పుట్టిన వారిలో , ఎంతో మందికి ఆదర్శంగా నిలిచినా, చిరంజీవి అంటే.. ఈ తరానికి.. insta memes మాత్రమే! మీకేమి తెలుసు రా చిరంజీవి నటన అండ్ కామెడీ అని చెప్పాలని అనుకున్నా, సరైన సినిమాలు కుదరక.. ప్రతి అభిమాని మూగబోయే వాడు!

చిరంజీవి కామెడీ టైమింగ్ అద్భుతం. ఒక చంటబ్బాయి! ఒక్క ఘరానా మొగుడు.. ఒక అన్నయ్య.. ఒక శంకర్ దాదా.. ఒక్క మన శంకర వర ప్రసాద్ గారు! బాస్, మీరు ఇలానే క్వాలిటీ ఉన్న డైరెక్టర్స్ తో తియ్యండి! మీ ఎనర్జీ, మాకు stress reliever. మీరు ఇచ్చే ఎంటర్టైన్మెంట్, తెలుగు సినిమా కి ఆక్సిజన్!

చివరగా…

సినిమాలో, అనిల్ రావిపూడి రాసుకున్న కామెడీ లైన్స్ కి, మెగాస్టార్ నటన తోడు అయ్యి, మొదటి భాగం పిచ్చి high ఇస్తుంది.. చిరంజీవి లో మిస్ అయ్యిన humour, చిలిపి చేష్టలు, ఈ సినిమాలో మళ్ళీ మనము చూసే అవకాశం వచ్చింది. రెండవ సగం(సెకండ్ హాఫ్) కొద్దిగా స్లో అయ్యింది. అంటే బాలేనట్టు కాదు. మొదటి సగం ఇచ్చిన ఎనర్జీ ఇవ్వలేకపోయింది. వెంకటేష్, చిరంజీవి కాంబినేషన్ సీన్స్ బాగున్నాయి.

ప్రతి 80s, 90s కిడ్స్, తమ పిల్లలకి లేక తర్వాతి తరానికి, చిరంజీవి కోసం చెప్పాలి.. పరిచయం చేయాలి అనుకుంటారు. ఇన్నాళ్లు సరైన సినిమాలు పడలేదు.

“మన శంకర వర ప్రసాద్ గారు ”  will definitely introduce Chiranjeevi to this Generation. And his comedy timing has been rediscovered by ANIL RAVIPUDI.

నేను అయితే, కచ్చితంగా.. చిరంజీవి ఫ్యాన్స్ గా మారబోయే తర్వాతి తరానికి ముందే ఆనందంతో, ఈ fandom కు welcome చెప్తున్నాను!

I am rating this movie with 3/5

4.7/5 - (23 votes)

3 thoughts on “మన శంకర వర ప్రసాద్ గారు (2026)  మా చిరంజీవి లోని, నటుడ్ని మరలా ఆయనకి, మాకు పరిచయం చేసినందుకు.. ప్రత్యేక ధన్యవాదాలు అనిల్..”

  1. Ikkada Anil ravipudi hadavidi lo cheyadam comedy thaggindhi konchem …. Chiru movie ayithe kadu inkonchem kavali … Boss ra lucha anela theeyali movie

    Reply

Leave a Comment