Kantara – Chapter 1 (2025) : కొత్తగా ఏమిలేదు! అదే అరుపులు. అవే అడవి శక్తులు!


నటుడే దర్శకుడు అయితే:

నటుడు కి ఏమి కావాలో, అద్దంలో తనని తాను చూసుకునే నటుడు కే తెలుస్తుంది! తనలోని, ఆర్టిస్టిక్ ఈగో satisfaction కోసం, కొత్త కొత్త కథలు వెత్తుకుంటూ.. సరికొత్త భావాలు పలికించే ప్రయత్నాలు చేస్తుంటారు. అది, తనకి తానే దర్శకత్వం చేసుకున్నా, కమల్ హాసన్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ఉపేంద్ర అయినా, పృధ్వీరాజ్ సుకుమారన్ అయినా, రిషబ్ షెట్టి అయినా, ప్రయోగాలు చేయడానికి, వేరే దర్శకుడు కోసం వేచి చూడలేదు!

అదంతా సరే. ఇంతకీ ఈ కాంతారా ఎలా ఉంది?

హహ! కాంతార సినిమా కోసం చెప్పమంటే, దర్శకుడు గా మారిన నటుడు కోసం చెప్తున్నాడేంటి? అనే కదా మీరు అనుకుంటున్నారు? ఈ సినిమా కూడా అలానే చాలా వరకు నాన్ సింక్ లోనే ఉంది. తనలోని నటుడు కోసం, రిషబ్,తన చుట్టూ కథ అల్లుకుంటే, తన లోని దర్శకుడు నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు!అల్లరి చిల్లరగా ఆడుతూ పాడుతూ, పేలవమైన పాత్రలతో , కథని మొదటి భాగం వరకు తీసుకుని వచ్చాడు రిషబ్!

ఫస్ట్ హాఫ్ పెద్దగా ఏమి లేదు. వివిధ రకాల జంతువులు.. కట్టడాలు, వేషాలు ఇవన్నీ , పిల్లలకి నచ్చే అవకాశం ఉన్నా, వాటితో పాటు వచ్చే హాస్య సన్నివేశాలు, రెగ్యులర్ ఆడియెన్స్ కు , హాస్యంతో చిరాకు కూడా తెప్పిస్తాయి!

మాట్లాడుకోవాల్సిన రెండో భాగం:

2022 లో వచ్చిన  కాంతార చూసిన వారికి, ఆ సినిమా నచ్చిన వారికి ,  ఈ సెకండ్ హాఫ్ కొద్దిగా బాగుంది అనిపించవచ్చు.

అదే సినిమా చూసి, ఈ సినిమా లో అయినా, క్లైమాక్స్ ఒక్కటే కాకుండా, సినిమా అంతా బాగుంటుందేమో అని వచ్చినవారికి, కొంత నిరాశ తప్పదు! ఎక్కువ రేట్ పెట్టీ టికెట్ కొని, మళ్ళీ అదే సినిమా చూస్తున భావం రాకపోదు!

” గులిగా”ఎపిసోడ్ లో, రిషబ్ చేసిన నటన అద్భుతం! “రుక్మిణి వసంత్ “పాత్ర, చివర్లో ఒక్క  గంట సేపు, డిఫరెంట్ షేడ్స్ పలికిస్తూ, కాంతార రెండో భాగం కు కావాల్సిన డ్రామా పండిస్తుంది.

సరే. అదే సినిమా మళ్ళీ తీసారు అన్నారు! మరి క్లైమాక్స్ ఎలా ఉంది?

బాగుంది! అప్పటివరకు, సాగతీత, అర్థం లేని మాటలు, విసుగు తెప్పించే జోకులు తో వెళ్తున్న సినిమాని, రిషబ్ షెట్టి, మరలా క్లైమాక్స్ లో, తనదైన శైలిలో నటించి, స్క్రీన్ ప్లే లో వేగం పెంచుతూ, కొత్త పాత్రలు తీసుకుని వచ్చి, కాసింత రిలీఫ్ ఇచ్చే ప్రయత్నం చేశారు! ఈ చివరి 20 -25 నిమిషాలు, ప్రతి ఒక్కరూ (కెమెరా, సంగీతం, VFX) దర్శకుడి ఆలోచనకి, రూపం తీసుకుని వచ్చారు.

చివరగా..

కాంతార (2022) నుంచి దర్శకుడు ఏమి నేర్చుకోలేదు అనిపించింది. ఆ సినిమా విజయం కావడంలో, చివరి 10 నిమిషాలు కారణం అయితే, ఈ కాంతార (2025)నాకు  పెద్దగా నచ్చకపోవడానికి, అవే కారణాలు అయ్యాయి! Mystical/supernatutal డ్రామా ఇష్టబడే వారు ఒక్కసారి చూసి యావరేజ్ అనుకుంటారు! ఇంకేదో ఆశించి థియేటర్ లోకి అడుగు పెట్టినవారికి మాత్రం, ఒక్కింత నిరుత్సాహం తప్పదు!

I am rating this film with 2.5/5


మీకు సినిమా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి! మరియు ఈ రివ్యూ కి మీరు రేటింగ్ కూడా ఇవ్వొచ్చు! 🙂

4.7/5 - (16 votes)

4 thoughts on “Kantara – Chapter 1 (2025) : కొత్తగా ఏమిలేదు! అదే అరుపులు. అవే అడవి శక్తులు!”

  1. Maybe we can watch Kanthara: Chapter 1 in the theater once, since it’s a bigger production made after the success of the first movie.

    Reply
  2. When I watched Kantara Part 1 in the theatre, I felt something was missing. The film had strong cultural elements that people from that background may connect with deeply, but for a wider audience, it seemed like the story didn’t have a clear beginning. At times, it felt more like sounds and atmosphere than a proper narrative.

    Reply

Leave a Comment