(Please note that this is a collective review of both films, Korean Kanakaraju and DC. )
As I prefer watching films in their original language, I watched DC in Tamil. Therefore, I won’t be commenting on the Telugu dubbed version. I have also heard that there are some RR issues with the dubbed version.
ముందుగా.. కొరియన్ కనకరాజు
సినిమా టైటిల్ అనౌన్స్ చెయ్యగానే, చాలామంది, ఇదేదో cringe అయ్యేలా ఉంది అనుకున్నారు. “KAMSAMIDHA” సాంగ్ రిలీజ్ అవ్వడమే తరువాయి, తెలుగు కొరియన్ అభిమానుల నుంచి, వరుణ్ తేజ్ దురభిమానుల వరకు.. సినిమా మీద అంచనాలు తగ్గించే ప్రయత్నం చేశారు.. ఇవేమి పట్టించుకోకుండా , సినిమా మీద నమ్మకంతో, గురువారం నుంచే, ప్రీమియర్ వేశారు టీమ్.
మరి, నాకు సినిమాలో నచ్చిన అంశాలు:
- వరుణ్ తేజ్ నటన మరియు అనంతపురం జిల్లా యాస! పెనుకొండ లో పుట్టి పెరిగిన కుర్రాడిలా, వరుణ్ మాట్లాడిన తీరు, పలికించిన హావభావాలు, సినిమాకి పెద్ద అసెట్.
- సత్య పాత్ర. “మేర్లపాక గాంధీ ” తన సినిమాల్లో.. కమెడియన్ పాత్ర, హీరో కి దీటుగా ఉండేలా రాసుకుంటారు. వెంకటాద్రి express, Express రాజా సినిమాల్లో, సప్తగిరి తో జనాల్ని నవ్వించినట్టే, ఈ సినిమాలో.. సత్య పాత్ర, కథను ముందుకి తీసుకుని వెళ్తూ.. మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది.
- కొరియన్ ఎపిసోడ్స్. వరుణ్ తేజ్ పాత్ర, కొరియన్ Gangster ” four fingers” మధ్య నడిచే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి!
సినిమాలో నాకు నచ్చని విషయం:
Climax. అప్పటి వరకు, బాగానే ఉందిగా సినిమా.. క్లైమాక్స్ లో సింపుల్ ఫైట్ పెట్టేస్తే, వరుణ్ తేజ్ కి మంచి హిట్ పడినట్టే అనుకుని, క్లైమాక్స్ కు సిద్ధపడిన ప్రేక్షకుడు కు.. ఊహించని VFX, అర్ధం పర్ధం లేని “ఆత్మల యుద్ధం ” , ఇదే హిట్ ఫార్ములా అనుకుని దర్శకుడు పెట్టిన.. శివ తాండవం స్తోత్రం.. నీరసం తెప్పించడమే కాకుండా.. సినిమా ను అలా అమాంతం కిందకి తోసేసేసాయి. క్లైమాక్స్ పోర్షన్స్ మీద ఇంకాస్త శ్రద్ధ పెట్టూండాల్సింది. ( ఎడిటింగ్ రూమ్ లో, దర్శకుడు regret ఫీల్ అయ్యే ఉంటాడు!)
ఇక ఇప్పుడు.. లోకేష్ కనగారాజ్ నటించిన ” DC “
లోకేష్ కనగారాజ్. తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది, ” కూలీ” సినిమాతో.. తెలుగు యువతను థియేటర్లకు పరుగులు పెట్టించాడు. (మొదటి సగం చూసి, జనాలు కూడా థియేటర్ నుంచి అలానే పరుగులు తీశారు అనుకోండి, అది వేరే విషయం!) అతను హీరోగా నటించిన సినిమా DC.
అనిరుధ్ ,” RAGA OF REVENGE” ట్రాక్ తో, జనాలు .. ముఖ్యంగా.. తెలుగు సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసేలా చేశాడు. దర్శకుడు “అరుణ్ మాథేశ్వరన్” తీసిన “SANI KAYIDHAM” , ” ROCKY ” సినిమాలు, వయోలెన్స్ ఇష్టబడే ప్రేక్షకుడు కి, బాగా నచ్చుతాయి. ధనుష్ “కెప్టెన్ మిల్లర్ ” నిరాశపర్చిన, DC తో, violence ను, bloodbathe ను పరిధికి మించి పొంగించాడు అరుణ్.
” DC ” లో నాకు నచ్చిన విషయాలు:
- ప్లాస్టిక్ ” చంద్ర ” , లోడ్ చేసిన తుపాకీ “దాస్” . రెండవ సగం నుంచి, వారి ఇద్దరు మధ్య నడిచే డ్రామా, యాక్షన్ మరియు వాళ్ళిద్దరూ కోసిన తలలు.. చిందించిన రక్తాలు.. అనిరుధ్ బాణీలు.. ఒక్కదాని తరువాత ఒకటి.. ప్రేక్షకుడు ముందుకు వస్తూ.. ఉబ్బితబ్బిబ్బు కు గురి చేస్తాయి!
- అనిరుధ్. మంచి dolby Atmos స్క్రీన్ లో, సినిమా చూసిన వాడు.. బయటికి లోకేష్ కనగారాజ్ కోసమో, WAAMIKA కోసమో కాకుండా.. అనిరుధ్ కోసం టైమ్ ఇచ్చాను.. నా టైమ్ కు తగ్గ output వచ్చింది అని productive గా ఆలోచిస్తూ ఇంటికి చేరుతాడు. నాసిరకం సీన్లకే ప్రాణం పోస్తాడు అనిరుధ్. అలాంటిది దమ్మున సీన్స్ దొరికితే ఊరుకుంటాడా? అలాంటి సన్నివేశాలు బోలెడన్ని ఉన్నాయి సినిమాలో. ఇక అనిరుధ్ చేసిన విస్పోటనం… వర్ణనాతీతం!
నాకు నచ్చని విషయం:
మితిమీరిన వయోలెన్స్. పోలీస్ లో ఒకరు మంచి వాడు లేడు అన్నట్టు.. లోకేష్ పాత్ర, ప్రతి పోలీస్ ను మట్టిపెడుతుంటే,చూడటానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒక్క పాత్ర అయినా.. మంచి పోలీస్ లా బిహేవ్ చేస్తే, చూడాలనిపించింది నాకు.
చివరగా…
నువ్వెంత మంచి చేసినా.. జనాలకి గుర్తు ఉండేది ఎప్పుడో నువ్వు చేసే చెడే! అలా.. సినిమా అంతా ఎంటర్టైనింగ్ గా ఉన్నా, “కొరియన్ కనకరాజు ” క్లైమాక్స్ లో చతకిలబడి, నవ్విన నవ్వులు మర్చిపోయేలా చేశాడు.
నువ్వు చెడులోను.. మంచిని వెతుకు.. తప్పు చూసే కోణం ది. ప్రవర్తనలు ది కాదు అంటూ.. ఈ ” లోకేష్ కనగారాజ్ (& దర్శకుడు అరుణ్ ) ” DC” ద్వారా.. చక్కని Revenge Drama అందించారు. అనిరుధ్ ఒకసారైనా , ఓడిపోతే చూడాలని ఉంది. బహుశా ఆ ఛాన్స్ ఇవ్వడమో విమర్శకులకు!