Biker (2026) : నాన్న కోసం ఎంత దూరమైన వెళ్లగలిగే.. racer కథ!

సింపుల్ గా

Motocross.. బైక్ రేసింగ్ స్పోర్ట్.. హీరో racer అనే విషయం తెలిసాక, ఆ రేసింగ్ కోసం మనకి ఏమి తెలీదు కదా.. అర్ధం అవుతుందా.. సినిమా ను ఎంజాయ్ చెయ్యగలనా అనుకుంటే, సినిమా చివరకి వచ్చేసరికి,  హీరో ఎదుర్కోవాల్సిన సవాళ్లను, ట్రాక్ మీద మన సవాళ్లు లాగా, హీరో గెలుపు ను మన గెలుపు లా , ఫీల్ అవుతాము! దర్శకుడు,  అభిలాష్ రెడ్డి విజయం సాధించింది ఈ అంశంలోనే! చాలా హృద్యంగా అనిపించే  ” తండ్రి – కొడుకు” సెంటిమెంట్ ను మధ్యలో ఉంచి, దాని చుట్టూ, రేసింగ్ కథ అల్లుకోవటం బాగుంది!

మరింత వివరంగా..

శర్వానంద్ సినిమా అంటే, మినిమం గ్యారంటీ అనే స్థాయి కి వచ్చేశాయి. అతను ఎంచుకునే కథలు.. వాటి కోసం ఆయన చేసే క్యారెక్టర్ transformations, ఎప్పుడూ మంచి ఫలితాలే ఇచ్చాయి! ఈ” biker ” సినిమా కోసం శర్వానంద్, శారీరకంగా చాలా కష్టపడ్డారు అనిపిస్తుంది. రేసర్ కు కావలసిన బాడీ లాంగ్వేజ్ ను, ధృడత్వం ను స్క్రీన్ మీద చక్కగా నటించి అలరించాడు. 

రావు రమేష్ గారు చేసే, తండ్రి రోల్స్ ఇక… రాజశేఖర్ గారు ముందు వచ్చి పడుతాయి అనడంలో నాకేమి సందేహం లేదు. శర్వా – రాజశేఖర్ మధ్యలో వచ్చే ఫాదర్ సెంటిమెంట్ సీన్స్ స్క్రీన్ మీద బాగా పండాయి!

దర్శకుడు…నాన్న పిచ్చోడు అని, తన ముందు సినిమ,  ” మా నాన్న సూపర్ హీరో”  కి అర్ధం అయిపోతుంది. ఇందులో,  తండ్రి మీద ప్రేమను .. కొండల్ని కూడా దాటించే ధైర్యం గా చూపించడం బాగుంది..

చివరగా..

A man goes to any extreme to defend his father.

స్కూల్లో, వాళ్ళ నాన్న ను తిడితే, కొడతాడు శర్వా కొడుకు..

మరి , వాళ్ళ నాన్న  మీద ఏకంగా నింద మోపితే…హెల్మెట్ పెట్టి, యాక్సిలేటర్ రైస్ చేసి, గేర్స్ మారుస్తూ..  ట్రాక్ ఎక్కి మరీ, మా నాన్న గ్రేట్ అని చూపిస్తాడు శర్వా!

ఫస్ట్ హాఫ్ అలా అలా వెళ్ళిపోయినా, సెకండ్ హాఫ్ మరియు క్లైమాక్స్ సినిమా ను నిలబెట్టాయి! కెమెరా విభాగం పని తీరు బాగుంది. సౌండ్ ట్రాక్ కొంచెం జోష్ ను తగ్గించినా, రచన.. దర్శకత్వం .. మంచి సినిమా చూసిన అనుభవాన్ని మిగులుస్తాయి!

I’m rating this movie with 3.25/5

4.6/5 - (15 votes)

1 thought on “Biker (2026) : నాన్న కోసం ఎంత దూరమైన వెళ్లగలిగే.. racer కథ!”

Leave a Comment