సింపుల్ గా…
ఇంటర్నేషనల్ సినిమా exposure తో,
క్షణం(Original idea : Gone Baby gone (2006) …
ఎవరు? ( Original idea : The invisible guest(2016)
తీసి.. హిట్స్ కొట్టేశారు, అడివి శేష్! మార్పులు చేర్పులు చెయ్యడంలో, అతను సిద్ధ హస్తుడు. “Dacoit” విషయం లో ఆయన బాగానే తడబడ్డారు.. (రచయిత గా. మరియు నటుడు గా..)
వివరంగా…
శేష్ సినిమా అనగానే, మేధావి వర్గం సినిమా చూడాలి అనుకుంటారు. ఆయన ముందు సినిమాలు ప్రభావం అవ్వొచ్చు.. సినిమాల మీద ఆయన అప్రోచ్ అవ్వొచ్చు.. అడివి శేష్ సినిమాలు ఎప్పుడూ, జనరంజకంగా ఉంటాయి. కానీ…
“Dacoit” ఒక్క పాత 1990 దశకంలో రావాల్సిన సినిమా. హీరో గారు జైలు పాలు అవ్వడం.. హీరోయిన్ గారు మూవ్ ఆన్ అవ్వడం.. హీరో గారు గొప్ప మనసు చేసుకుని, ” కర్ణుడు” అవతారం ఎత్తడం! ఇంత పాత గా.. అస్సలు ఏం మాత్రం కొత్త డ్రామా, కొత్త ఎమోషన్స్ కనబడకుండా.. శేష్ మరియు దర్శకుడు “Shaneil Deo” రాసుకున్న కథ.. ఆడియెన్స్ నే కాదు… శేష్ సినిమా అనగానే, ఎదురు చూసే మేధావి వర్గాన్ని కూడా ఆశ్చర్య పడేలా చేస్తుంది. ” కోవిడ్ సమయంలో జనాలు పడిన కష్టాలు,, మరోసారి గుర్తు చేసే ప్రయత్నం ఐతే బాగుంది.
అస్సలు కెమిస్ట్రీ కనబడని పాత్రలు మధ్య, ప్రేమ…మోసం అంటూ డిఫరెంట్ ఎమోషన్స్ చెప్పాలి అనుకోవడం లో శేష్ తడబడితే.. ఈ సినిమా ను.. మధ్య భాగంలో ఎలా నడిపించాలో అర్థం కాక.. దర్శకుడు మళ్ళీ తన హీరో ఇంట్రడక్షన్ టెంప్లేట్ నే వాడుకోవడం… సినిమా ను వెనుక బడేలా చేశాయి. ఇంక, Robbery ఎపిసోడ్ ఎంత తక్కువ గా మాట్లాడితే అంత మంచిది. దొంగతనం చెయ్యడం.. ATM నుంచి డబ్బులు తెచ్చుకున్నంత సులభం అనట్టు చూపించారు( ఇలాంటి డైలాగ్ , సునీల్ పాత్ర చెప్తుంది. బహుశా, వాళ్ళకి అనిపించే ఉండొచ్చు!)
చివరగా…
శేష్ సినిమా అనగానే…నేను అందరిలానే ఎదురు చూసాను. కారణం: ఈ సారి అతను కొత్తగా తెలుగు ప్రేక్షకులకు ఏమి చెప్పాలి అనుకుంటున్నారు అని. క్షణం, ఎవరు సినిమాల్లో వచ్చిన twist లు, ప్రతి తెలుగు సినిమా అభిమాని గుర్తు పెట్టుకుంటారు. ఇందులో, ట్విస్ట్ సంగతి పక్కన పెట్టండి. కనీసం.. స్టోరీ.. స్క్రీన్ ప్లే లో ఫెయిల్ అయ్యాడు శేష్. Violence ఎక్కువ మోతాదు లో ఉండటం.. భాషలో బూతులు వినిపించడం తో ఫ్యామిలీ ఆడియన్స్ కొంత ఇబ్బంది పడొచ్చు!
అనురాగ్ కశ్యప్ నటన బాగుంది. మృణాళ్, తన పరిధి మేర బాగానే నటించారు. శేష్ తన comfort పాత్ర కాకపోవడం తో, డైలాగ్ డెలివరీ విషయం లో కొంచెం తడబడ్డారు అనిపించింది.
సినిమా కథ ఎంత పాతది అయినా, స్క్రీన్ ప్లే లో మ్యాజిక్ కనిపిస్తే, సినిమా నిలబడిన రోజులు ఉన్నాయి. ఈ dacoit లో, రచయిత వర్గం, స్క్రీన్ ప్లే మీద పట్టు కోల్పోయి, కథ ను అక్కడ అక్కడే తిప్పుతూ, ట్విస్ట్ రాబట్టుకోవాలి అనుకోవడం…పెద్ద మైనస్.
I didn’t enjoy the movie. I had good expectations on the crew. The money was spent.. Days were given. Quality was produced. Yet, as a writer , Sesh failed to engage the audience.
I’m rating the movie with 2/5