నారి నారి నడుమ మురారి (2026) & సంక్రాంతి సినిమాలు

Sai Talks Cinema Readers కి, సినిమా ప్రేమికులు కు, సంక్రాంతి శుభాకాంక్షలు! సంక్రాంతి అనగానే గుర్తొచ్చేవి, భోగి మంటలు, గాలిపటాలు, పొంగలి & పిండి వంటలు , చుట్టాలు మరియు సినిమాలు. ఇలా ఈ సారి, మన తెలుగు సినిమా నుంచి ఐదు సినిమాలు సంక్రాంతి కి పలకరించాయి.

వాటిలో నాకు నచ్చిన సినిమాలు ఆర్డర్ వైజ్ ఇచ్చాను, ఈ ఆర్టికల్ లో..

ముందుగా, నారి నారి నడుమ మురారి మీద నా అభిప్రాయాన్ని సింపుల్ గా చెప్పేస్తాను!


నారి నారి నడుమ మురారి – మరొక్క చక్కని సంక్రాంతి సినిమా !

శర్వానంద్ మంచి నటుడు. ఏదైనా కళ్ళతోనే హావభావాలు బాగా పలికించగలడు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటుడు పైగా, సంక్రాంతి సీజన్ అనగానే, హిట్ సినిమాలు ఇచ్చే అలవాటు ఉన్న నటుడు. అతని స్టోరీ జడ్జిమెంట్ ఎప్పుడూ బాగానే ఉంటుంది!

ఈ సంక్రాంతి కి శర్వానంద్ నటించిన…  “నారి నారి నడుమ మురారి” నాకు బాగా నచ్చింది. మొదటి సగం లో వచ్చే కామెడీ సీన్స్, నరేష్, సత్య, సుధాకర్ కామెడీ భలే వచ్చాయి. ఆ సమయంలోనే, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కూడా తోడు అయ్యి, మొదటి సగం మంచి పండుగ సినిమా vibes ఇచ్చింది..

రెండవ సగం, కొంచెం నెమ్మదించినా, చివరి 20 నిమిషాలు మళ్ళీ, దర్శకుడు రామ్ అబ్బరాజు స్క్రీన్ ప్లే లో పరుగులు తీసుకుని వచ్చి, మంచి ఎపిసోడ్స్ బ్యాక్ టు బ్యాక్ రాసి, అలరించారు.

ఈ సంక్రాంతి కి, హాయిగా చూసేసే సినిమాల్లో, మొదటి వరుస లో ఉంటుంది ఈ సినిమా.

నేను, ఈ సినిమాకి 3/5 రేటింగ్ ఇస్తున్నాను!


సంక్రాంతి సినిమాలు మరియు నేను రికమెండ్ చేసే ఆర్డర్

  1. మన శంకర వర ప్రసాద్ గారు
  2. నారి నారి నడుమ మురారి
  3. అనగనగా ఒక రాజు
  4. భర్త మహాశయులకి విజ్ఞప్తి
  5. రాజా సాబ్

ఈ సంక్రాంతి చాలా మెమొరబుల్ నాకు అయితే!

ఎప్పటినుంచో, చిరంజీవి సినిమాల్లో మనం మిస్ అవుతున్న ఆయన నటన, కామెడీ టైమింగ్ ను అనిల్ రావిపూడి తిరిగి మనకి అందిస్తే… ఫ్యామిలీస్ కి చక్కని pricing లో (నారి నారి నడుమ మురారి కి hikes లేవు) ఒక్క మంచి ఫ్యామిలీ సినిమా ఇచ్చాడు శర్వానంద్!

కామెడీ అనగానే, డైలాగ్స్ చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలా.. కళ్యాణ్ శంకర్, నవీన్ పోలిశెట్టి కలిపి.. మనకి చక్కని one liners ఇచ్చారు,” అనగనగా ఒక రాజు ” లో. రెండవ సగంలో.. సినిమా ఆఫ్ ట్రాక్ వెళ్ళింది కానీ, మొదటి భాగంలో ఉన్న కామెడీ ఉండి ఉంటే, అనగనగా ఒక రాజు కూడా, నారి నారి నడుమ మురారి కి మంచి కాంపిటేషన్ ఇచ్చి ఉండేది.

ఇక.. రవితేజ నటించిన.. భర్త మహాశయులకి విజ్ఞప్తి.. ఈ టైటిల్ చూసి.. పెళ్ళి అయిన వారు.. రవితేజ మనకి ఏదైనా కొత్తగా చెప్పి అలరిస్తాడు అనుకుంటే, అది పొరపాటే! మరీ నీరసంగా.. ఎలా ముగించాలో తెలియక.. lazy గా రాసి తీసుకున్న కథ ఇది.

చివరగా.. రాజా సాబ్.. ప్రభాస్ లోని free flow ను గుర్తు చేశాడు మారుతి. Climax లో హిప్నాటిజం బాగుంది.. కానీ, ప్రేక్షకుడు కి అర్థం అయ్యే విధానం లో రాసుకుని ఉంటే, బాగుండేది.. నాకు అర్థం కావడం లేదా మీకు అర్థం కావడం ముఖ్యం కాదు. అందరికీ అర్థం అవ్వడంలోనే, దర్శక రచయిత నైపుణ్యం దాగి ఉంటుంది. ఆ విషయం లో “రాజా సాబ్” ఫెయిల్ అయ్యి, ప్రభాస్ కి మరియు అభిమానులు కి మర్చిపోయే సంక్రాంతి ను ఇచ్చింది.

ఈ సంక్రాంతి సినిమాలు జోరు ఇప్పుడే తగ్గవు. ఎంచక్కా.. థియేటర్ లో, మీరు.. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో సినిమాలన్నీ చూడాలని, మీకు ఇవి మర్చిపోలేని జ్ఞాపకాలు ఇంకెన్నో ఇవ్వాలని కోరుకుంటూ…

మీ,

Venkata Sai Pakala !

4.8/5 - (11 votes)

అనగనగా ఒక రాజు (2026) : నవీన్ పోలిశెట్టి లోని Stand-up comedian ఫుల్ గా డ్యూటీ చేసిన సినిమా.

సింపుల్ గా..

నవీన్ పోలిశెట్టి, సినిమాల్లోకి రాకముందు.. AIB అనే నార్త్ హిందీ యూట్యూబ్ ఛానెల్ లో, Stand-up, sketch comedy , skits లాంటివి చేసేవాడు. తర్వాత.. సినిమాల్లో ముఖ్యంగా తెలుగు సినిమా లో బిజీగా మారేకా, నటన మీదే ఫోకస్ పెట్టి.. కామెడీ ను తగ్గించాడు.. అతను లోని Stand-up కమెడియన్ ను బయటకి తీసి, రెండు గంటల పాటు.. వినోదం పంచాడు నవీన్. స్టోరీ.. స్క్రీన్ ప్లే.. డైలాగులు ఆయనవే! (Mad cinema దర్శకుడు కళ్యాణ్ శంకర్ కూడా రాసి ఉండొచ్చు.. క్రియేటివ్ డిఫరెన్స్ వలన ఆయన పక్కకి తప్పుకున్నారు అంటున్నారు)

రాజు గారు.. ఏమి చేశారేంటి?

వినోదం పంచారు. జమీందారు గారి మనవడి పాత్రలో ఒదిగిపోయారు. నవీన్ ఇందులో commercial మీటర్ కూడా క్యాచ్ చేస్తూ.. చక్కని డాన్సులు.. ఫైట్స్ చేశాడు. మొదటి భాగం బాగా నవ్వులు తెప్పించాడు నవీన్. రెండవ సగంలో కామెడీ తగ్గి, స్టోరీ మొదలు అవ్వడంతో , రాజు గారు కొంచెం నీరసించినా, క్లైమాక్స్ కి వచ్చేసరికి.. మళ్ళీ బాగానే ఎంటర్టైన్ చేశారు.

చివరగా..

రూరల్ కామెడీ కి ఎప్పుడూ తెలుగు సినిమాలో స్థానం ఉంటుంది. అది కూడా పండుగకి వస్తే, మరింత ఎక్కువగా ఆదరణ ఉంటుంది. “అనగనగా ఒక రాజు” కూడా జనాలు ను నవ్వించి, బయటకి హాయిగా పంపించే సినిమానే! నవీన్ చెప్పిన సింగిల్ లైన్ డైలాగ్స్ బాగా పేలాయి. రెండవ సగంలో, స్టోరీ మెయిన్ ట్రాక్ లోకి, ఎంటర్టైన్మెంట్ బ్యాక్ ట్రాక్ లోకి వెళ్ళడం తో, కొంచెం ఆ వినోదం తగ్గినట్టు అనిపిస్తుంది. మిక్కీ జే మేయర్ ఇచ్చిన పాటలు స్పీడ్ బ్రేక్స్ లా అనిపిస్తాయి. ఎడిటింగ్ విభాగం రెండవ సగంలో కేర్ తీసుకుని, క్రిస్పీగా కట్ చేసి ఉండాల్సింది.

మొత్తానికి, కొత్త కథైతే కాదు. ఎటువంటి expectations లేకుండా చూస్తే,  రెండు గంటలు పాటు అలా ఫ్యామిలీతో నవ్వుకుని వచ్చేయొచ్చు!

I am rating this movie with 2.75/5

4.7/5 - (12 votes)

భర్త మహాశయులకి విజ్ఞప్తి! (2026) : రవితేజ కి ప్రత్యేక విజ్ఞప్తి. Take a break!!

సింపుల్ గా:

రవితేజ మాస్ సినిమాలు తీస్తే, ఇతను క్లాస్ సినిమాలు తీస్తే భలే ఉంటుంది ఏమో అనిపిస్తుంది. అదే ఇతను క్లాస్ సినిమాలు తీస్తే, ఇతని ఎనర్జీ కి.. మాస్ సినిమాలు చెయ్యడమే కరెక్ట్ అనిపిస్తుంది. అలాంటి నటుడు రవితేజ!

ఏంటి విజ్ఞప్తి?

చెప్తాను.. లాగ్ లేకుండా! ఇద్దరు మహిళలు మధ్య చిక్కుకున్న మొగుడు పాత్ర ఎందరో నటులు గొప్పగా నటించి, మెప్పించి మళ్ళీ అవే తీసి తుస్ మనిపించారు. అందరూ చెయ్యగా లేనిది, నేను కూడా క్లాస్ గా.. ఇద్దరు అమ్మాయిలు మధ్య నలిగే పాత్ర ఎందుకు చెయ్యకూడదు అనుకున్నాడు ఏమో రవితేజ, ఈ ఐడియా…దర్శకుడు కిషోర్ తిరుమల కి చెప్పి…సినిమా తీయించుకున్నాడు.

అంతా బానే ఉంది కానీ, అతను చెప్పాలనుకున్న విజ్ఞప్తి ఏంటానేది తెలుసుకోవడానికి, సినిమా అంతా చూడాల్సిన అవసరం లేదు. సింపుల్ గా, క్లైమాక్స్ లో.. ఎండ్ credits ముందు వచ్చే.. 1 మినిట్ డైలాగ్ చాలు.. అది చెప్పడానికి.. 2 గంటలు టైమ్, 258రూపాయలు టికెట్, 20రూపాయలు పార్కింగ్ ఛార్జ్ తీసుకున్నారు. అదేదో యూట్యూబ్ లోనో, podcast లోనో చెప్పేస్తే సరిపోయేది!

చివరగా…

సినిమా రెండు గంటలే! కానీ ఏదో మూడు గంటల సినిమా చూసినట్టు ఉంటుంది.కిషోర్ తిరుమల లోని రచయిత ను, రవితేజ సరిగ్గా జడ్జ్ చేయలేకపోయారు అనిపించింది. ఇంకో రెండు రోజులు కూర్చుని.. screenplay, దర్శకత్వం మీద దృష్టి సారిస్తే, కనీసం చూడటానికి అయినా బాగుండేది. రెండో సగంలో వచ్చే DJ mix ఏమీ కొత్త ప్రయోగం కాదు. రవితేజ energy మిస్ అయ్యింది సినిమా అంతా. నీరసంగా ఉండే రవితేజ ను ఎవరూ చూడాలని థియేటర్ కి రారు. ఇంకా క్లైమాక్స్ ఎలా ముగించాలో తెలియక.. కిషోర్ తిరుమల రాసిన సీన్.. అబ్బో! బయట టాక్ బానే ఉంది. చూస్తాను అనుకుంటే, ఒకసారి అలా అలా చూడటానికి ఒకే. కానీ ఇదేమీ కొత్త కథ కాదు. కొత్త నటనలు కావు!

I am rating this movie with 2.25/5

4.9/5 - (11 votes)

మన శంకర వర ప్రసాద్ గారు (2026)  మా చిరంజీవి లోని, నటుడ్ని మరలా ఆయనకి, మాకు పరిచయం చేసినందుకు.. ప్రత్యేక ధన్యవాదాలు అనిల్..

సింపుల్ గా :  కామెడీ టైమింగ్ అనగానే గుర్తొచ్చే హీరో కి, కామెడీ రాయడంలో phD చేసిన దర్శకుడు తోడు అయితే…. అదిరిపొద్ది సంక్రాంతి!

Comedy. Cringe & Anil Ravipudi

కామెడీ వ్రాయడం చాలా కష్టం. ఎందుకంటే, నాకు నవ్వొచ్చిన సందర్భం వేరే వాడికి సిల్లీ గా అనిపించొచ్చు! అప్పట్లో జోక్ కి నవ్వు రాకపోతే, కుళ్ళు కామెడీ అనేవారు..ఇప్పుడు cringe అంటున్నారు.. నవ్వించడం చేతకాని వాడే, cringe అంటూ, నవ్వించే ప్రయత్నం చేస్తాడు! Entertainment అనేది వ్రాసి, తీసి, confident గా జనాల ముందు ఉంచడం.. కొందరికే సాధ్యం! అందులో పరిణీతి చెందాడు అనిల్! 

ప్రతి పండుగకి, సినిమా విడుదల చేస్తూ.. తన పేరు మీద ఉన్న ఎంటర్టైన్మెంట్ మీటర్ కి ఎప్పటికప్పుడు సవాళ్లు విసురుతూ.. ఎదుగుతూనే ఉన్నాడు అనిల్ రావిపూడి!

ఇది కొన్ని సార్లు కుళ్ళు కామెడీ అనిపిస్తే, కొన్ని సార్లు భలే రాశాడబ్బా.. అనుకునేలా చేసే magician Anil. “మన శంకర వర ప్రసాద్ గారు” లో అనిల్ రాసుకున్న, ఎపిసోడ్స్ బాగున్నాయి! ముఖ్యంగా మొదటి భాగం! First half అయ్యేక బయటికి వచ్చి, చిరంజీవి కామెడీ టైమింగ్ ను పొగిడే ప్రతి అభిమాని , అనిల్ రావిపూడి ను ఆకాశం కు ఎత్తేస్తారు. మా చిరంజీవి లోని, నటుడ్ని మరలా ఆయనకి, మాకు పరిచయం చేసినందుకు.. ప్రత్యేక ధన్యవాదాలు అనిల్..

Star Starrrr.. Mega Starrr

చిరంజీవి ను చూస్తే, కమల్ హాసన్ , రజనీకాంత్ , శివాజీ గణేషన్ ను కలిపి చూసినట్టు ఉంటుంది అని , దిగ్గజ దర్శకులు KV బాల చందర్ గారు అన్నారు ఒక్క సందర్భంగా! Bigger than Bachchan అని నేషనల్ మీడియా రాసుకుంటూ వచ్చినా, 1980-1990 మధ్య పుట్టిన వారిలో , ఎంతో మందికి ఆదర్శంగా నిలిచినా, చిరంజీవి అంటే.. ఈ తరానికి.. insta memes మాత్రమే! మీకేమి తెలుసు రా చిరంజీవి నటన అండ్ కామెడీ అని చెప్పాలని అనుకున్నా, సరైన సినిమాలు కుదరక.. ప్రతి అభిమాని మూగబోయే వాడు!

చిరంజీవి కామెడీ టైమింగ్ అద్భుతం. ఒక చంటబ్బాయి! ఒక్క ఘరానా మొగుడు.. ఒక అన్నయ్య.. ఒక శంకర్ దాదా.. ఒక్క మన శంకర వర ప్రసాద్ గారు! బాస్, మీరు ఇలానే క్వాలిటీ ఉన్న డైరెక్టర్స్ తో తియ్యండి! మీ ఎనర్జీ, మాకు stress reliever. మీరు ఇచ్చే ఎంటర్టైన్మెంట్, తెలుగు సినిమా కి ఆక్సిజన్!

చివరగా…

సినిమాలో, అనిల్ రావిపూడి రాసుకున్న కామెడీ లైన్స్ కి, మెగాస్టార్ నటన తోడు అయ్యి, మొదటి భాగం పిచ్చి high ఇస్తుంది.. చిరంజీవి లో మిస్ అయ్యిన humour, చిలిపి చేష్టలు, ఈ సినిమాలో మళ్ళీ మనము చూసే అవకాశం వచ్చింది. రెండవ సగం(సెకండ్ హాఫ్) కొద్దిగా స్లో అయ్యింది. అంటే బాలేనట్టు కాదు. మొదటి సగం ఇచ్చిన ఎనర్జీ ఇవ్వలేకపోయింది. వెంకటేష్, చిరంజీవి కాంబినేషన్ సీన్స్ బాగున్నాయి.

ప్రతి 80s, 90s కిడ్స్, తమ పిల్లలకి లేక తర్వాతి తరానికి, చిరంజీవి కోసం చెప్పాలి.. పరిచయం చేయాలి అనుకుంటారు. ఇన్నాళ్లు సరైన సినిమాలు పడలేదు.

“మన శంకర వర ప్రసాద్ గారు ”  will definitely introduce Chiranjeevi to this Generation. And his comedy timing has been rediscovered by ANIL RAVIPUDI.

నేను అయితే, కచ్చితంగా.. చిరంజీవి ఫ్యాన్స్ గా మారబోయే తర్వాతి తరానికి ముందే ఆనందంతో, ఈ fandom కు welcome చెప్తున్నాను!

I am rating this movie with 3/5

4.7/5 - (23 votes)

రాజా సాబ్ (2026): మారుతి సాబ్. వద్దు సాబ్!

Psychological Thriller ఎలా తీసాడు అబ్బా మారుతి అని సందేహ పడాలో, ప్రభాస్ filmography లో, మరొక్క కొత్త కథ.. కొత్త genre అని సంబర పడాలో తెలియని సిట్యుయేషన్!

ఈ సినిమా అర్ధం కానీ వారికి, నేను సింపుల్ గా వివరించే ప్రయత్నం చేశాను ఈ రివ్యూ లో!

ఇది హారర్ అన్నారు.. హారర్ ఫాంటసీ అన్నారు.. ఇప్పుడు ఏంటి మీరు psychological thriller అంటున్నారు అనే కదా?

ఈ సినిమాలో, సంజయ్ దత్ పాత్ర కి Hypnotism ( బ్రెయిన్ కంట్రోల్ చేయడం) , Hallucinations (బ్రెయిన్ లో ఫాల్స్ /ఫేక్ ప్రపంచం సృష్టించడం) లాంటి విద్యలు తెలుసు.. ఆ శక్తితో, ప్రభాస్ ను ఎలా ఇబ్బంది పెట్టాడు అనేదే ఈ సినిమా కథ!

ముందుగా, తన మైండ్ లోకి ట్రాప్ చేసి, అందరిని హిప్నాటిజం చేయడం, లేకపోతే ఫేక్ scenario క్రియేట్ చేసి, జనాల్ని బయటపెట్టి, వాళ్ళ నుంచి, సంజయ్ దత్ తనకి కావాల్సింది చేసుకోడం ఈ సినిమా మెయిన్ థీమ్. ఇంత చక్కని psychological story ను , దర్శకుడు మారుతి నడిపించిన విధానం, రాసుకున్న screenplay బహుశా తెలుగు సినిమాల్లో, అత్యంత పేలవం మరియు నాసిరకం అన్నోచు! రాజా సాబ్ కన్నా చెత్త సినిమాలు చాలానే ఉన్నాయి, కానీ వాటిలో ఇటువంటి unique elements లేవు.. చేజేతులా , మంచి కథాంశం ను, అక్కర్లేని గ్లామర్ , పస లేని కామెడీ, చిరాకు తెప్పించే డైలాగ్స్ తో సమకూర్చి, చికాకు ను సింపుల్ గా 3 గంటలు పాటు అందించాడు మారుతి.

ప్రభాస్ నటన బాగుంది. పాన్ ఇండియా అంటూ , ప్రభాస్ లో మిస్ అయ్యిన, freeflow ఈ సినిమాలో కాస్త కనిపించింది. ఇంకా లుక్స్ విషయంలోనే అసలు సమస్య! ప్రభాస్ అంతటి అందగాడు ఇండియా సినిమా ఇండస్ట్రీలోనే ఉండేవాడు కాదు. కానీ, సినిమా సినిమాకి ప్రభాస్ స్టైలింగ్ చూస్తుంటే, ఏదీ శాశ్వతం కాదు అనిపించకమానదు.

తమన్ సినిమాలో సంగీతం ఇవ్వడం మానేసి, అలా తన దగ్గర ఉన్న అన్ని instruments మీద తలొచెయ్యి వేసి, నచ్చినట్టు కొట్టేశాడు. లిరిక్స్ వినబడవు. Mixing బాలేదు.

ఇక, హీరోయిన్స్! గ్లామర్ షో బాగా చేసినప్పటికీ, నటన ప్రభావం లేని పాత్రలు కావడంతో, పెద్దగా ఆకట్టుకోలేకపోయారు!

చివరగా..

మహేష్ బాబు – సుకుమార్ నటించిన ” 1 నేనొక్కడినే” కోసం ఇప్పటికీ అభిమానులు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఆ సినిమా ట్రైలర్ బాగా కట్ చేసి, జనాల్ని ప్రిపేర్ చేసుంటే, థియేటర్స్ కి వచ్చిన ప్రేక్షకుడు ముందే రెడీ అయ్యేవాడు అని చాలా సందర్భాల్లో ఆ సినిమా నిర్మాతలు చెప్పారు. సుమారు 12 ఏళ్ల తర్వాత , అటువంటి థీమ్ తో వచ్చిన రాజా సాబ్ కి ఇదే మేజర్ ఇబ్బంది.

ప్రేక్షకుడిని సిద్ధం చేయడంలో ప్రమోషనల్ కంటెంట్ విఫలం అయ్యింది. ఈ సినిమాలో psychological కాన్సెప్ట్ కు కావలసినంత weightage ఇవ్వకపోవడంతో, చివర్లో వచ్చే climax మరీ పేలవంగా ఉంది. మాములుగా చూస్తే, సంజయ్ దత్ ఇచ్చిన చిక్కు నుంచి, ప్రభాస్ బయటపడే సీన్స్ కి విజిల్స్ పడాలి. అంత స్కోప్ ఉంది కూడా ఆ సన్నివేశం కి.. కానీ ఆ కాన్సెప్ట్ కోసం దర్శక రచయితలు ఎక్కువ సేపు మాట్లాడకపోవడం, జనాలకి అర్ధం అయ్యేవిధనంలో చెప్పకపోవడం, ఇంగ్లీష్ terms ఎక్కువ అవ్వడంతో.. ఈ సినిమా గతి, స్థితి ,పరిస్థితి..అగమ్య గోచరం గా మిగిలింది.

నేను పెద్దగా ఎంజాయ్ చేసిన సీన్స్ ఏమి లేదు.. హిప్నాటిజం, Hallucinations concept బాగుంది. కొంచెం వర్క్ చేసుంటే, భలే ఉండేది ఏమో రాజా సాబ్.. ప్రస్తుతానికి మాత్రం,” వద్దు సాబ్ ” అనిపిస్తుంది.!

I’m rating this movie with 1.5/5

4.3/5 - (20 votes)