Train Dreams (2025) – Netflix: ఏడుస్తారు. నాది గ్యారంటీ!

ఇది Netflix లోకి వచ్చిన కొత్త ఇంగ్లీష్ సినీమా.  ప్రపంచ ప్రఖ్యాత పొందిన నవల ఆధారంగా రూపొందించిన సినిమా ఇది.

ఈ సినిమా చూడాలి అనుకునే వారు, మొబైల్ పక్కన పడేసి, laptop, లేదా టీవీ ముందు అలా కూర్చుని, ఏమి ఆలోచించకుండా చూడటం మొదలు పెడితే, సినిమా ప్రధాన పాత్రధారి, “రాబర్ట్ ” మిమల్ని తన ప్రపంచంలోకి నవ్వుతూ తీసుకుని వెళ్తాడు. కానీ, కొంచెం సమయం ఇవ్వండి, ఆయనకి.

సినిమా చూడటానికి సమయం లేని వారు ఈ రివ్యూ చూసి, సినిమా లో విషయం తెలుసుకోవచ్చు! ఈ సినిమా ఎమోషనల్ గా చాలా డెప్త్ ఉన్న కథ. నాకు ఉన్నంత పరిజ్ఞానం లో రాయడానికి ప్రయత్నిస్తాను!

కథ ఆరంభం.

తను ఎప్పుడు ఎక్కడ పుట్టాడో, తెలియని ఒక్క వ్యక్తి “రాబర్ట్” . అతను ఒంటరిగానే జీవితం గడుపుతూ ఉంటాడు. ఆయన ఒక లాగర్( అడవిలో చెట్లు కొట్టి, అమ్మి డబ్బులు సంపాదించే పని). ట్రైన్స్ లో వేరే ఊరు కి వెళ్లడం. అక్కడ అడవుల్లో , ఒక కంపెనీ కి చెందిన వారితో కలిపి పని చేయడం, చెట్లు నరకడం…అమ్మడం ఇదే అతని పని. ఈ ప్రక్రియ లో, ఆయన “గ్లేడిస్” అనే అమ్మాయిని కలుస్తాడు. తను కూడా ఇష్టబడటం తో, పెళ్ళి చేసుకుంటారు. అడవిలో దూరంగా ఒక చిన్న ఇల్లు కట్టుకుని నివసిస్తారు. వారికో చక్కని అమ్మాయి పుడుతుంది. జీవితం లో ఒంటరి తనం తప్పితే, ఇంకేమి చూడని రాబర్ట్ కి, ఈ జీవితం చాలా నచ్చుతుంది. తను , పని మీద చెట్లు కొట్టడానికి వెళ్ళినా, తన భార్య, కూతురు మీదే ధ్యాస!

మళ్ళీ.. లాగింగ్ సీజన్ మొదలు అవ్వడం తో, రాబర్ట్ , తన భార్యకు “బై” చెప్పేసి,  అడవి వైపు బయలుదేరుతాడు. మేము కూడా మీతో వస్తాము అని చెప్పిన భార్యకు, అది “చాలా ప్రమాదకరమైన అడవి. మీరు ఉండండి ఇకడే”, అని అతను బయలుదేరుతాడు! 

అడవిలో, చెట్లు కొట్టే సమయంలో చిన్న ప్రమాదం వల్లన, తనతో పని చేసే మిత్రుడు గాయపడుతాడు. అతడ్ని మామూలు మనిషిని చేసే ప్రక్రియలో, జీవితం తనకి కూడా ఏదో విప్పత్తు రాసి ఉంచింది అనుకుంటాడు రాబర్ట్. ఈ సమయంలోనే రాబర్ట్ తిరిగి తన ఊరికి వస్తాడు. అక్కడే… ట్రైన్ దిగుతుంటే.. అడవి చుట్టూ పొగలు.. మంటలు వ్యాపించి ఉంటాయి..

దిగులుగా ట్రైన్ దిగి, రాబర్ట్.. గ్లేడిస్, గ్లేడిస్ అంటూ అరుచుకుంటూ అడవిలోకి వెళ్తాడు. చుట్టూ మంటలు. పొగ. అతనికి ఊపిరి కూడా ఆడని దశ. అయినా, తన కూతురు, భార్య కోసం అడవిలోకి వెళ్తాడు రాబర్ట్.

ఎదురు చూపు…

అడవిలోకి వెళ్ళిన, రాబర్ట్ తన కూతురు, భార్య కనిపించక పోవడంతో.. చుట్టూ చూస్తాడు. అడవిలో కార్చిచ్చు కి, బుగ్గి బుగ్గి అయ్యిన తన ఇంటి దగ్గర కూర్చుని ఉంటాడు రాబర్ట్. వాళ్లకోసం వాళ్లు ఇంకా తిరిగి వస్తారు అని నమ్మకంతో రెండేళ్లు పైనే, ఆ అడవిలో, బయటికి వెళ్లకుండా దొరికింది తింటూ.. వాళ్ళ కోసం ఎదురు చూస్తాడు, రాబర్ట్.

Acceptence మరియు grief..

వాళ్లు ఇంకా తిరిగి రారు.. అడవి మంటల్లో, చనిపోయారు అని తనని తాను ఒప్పించుకుని, జీవితం లో ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తాడు రాబర్ట్. తన దగ్గరకి వచ్చిన, కుక్కల్ని పెంచుకుంటాడు. తిరిగి మరలా, చెట్లు కొట్టే ఉద్యోగం కి వెళ్తాడు. అక్కడ ప్రపంచం అంతా మారిపోవడం తో, తను ముసలి వాడ్ని అయిపోయాను అనుకుని, ఇంకా ఈ పని ఒద్దు అని, ఊరికి వచ్చేసి.. గుర్రం కొంటాడు రాబర్ట్. జనాల్ని గుర్రాల మీద అడవిలో నుంచి బయటికి డ్రాప్ చేస్తూ ఉంటాడు. తన ఒంటరి జీవితం లో, చెట్లు, పక్షులు శబ్దాలే తన ప్రపంచం. తన భార్య, కూతురు కోసం ఆలోచించని రోజు ఉండదు, రాబర్ట్ కి.

ఒంటరి గా పుట్టాము. ఒంటరిగానే పోతాము..

జీవితం లో ఎన్ని కష్టాలు చూసినా, ఎన్ని ఆనందాలు తన దరికి వచ్చినా, రాబర్ట్ జీవితంలో , కష్టాలు ఎక్కువుగా, ఆనందాలు తక్కువుగా ఉంటాయి. చివరగా, మారిన ప్రపంచం చూసి వద్దాము అని సిటీ కి వస్తాడు రాబర్ట్. కాంక్రీటు బ్రిడ్జి మీద ట్రైన్లు.. ఆకాశం లో విమానాలు.. థియేటర్ లో నాటికలు…ఇలా ప్రపంచం ముందుకి వెళ్ళినా, తను మాత్రం ఆ అడవిలో, తన భార్య కూతురు కోసం ఎదురు చూస్తూ, అతను కట్టుకున్న ఇంట్లోనే, నిద్రలో చనిపోతాడు  రాబర్ట్.

తన మంచం మీద ఆకులు…పువ్వులు.. గడ్డి మొలిచినట్టు చూపిస్తాడు దర్శకుడు( చాలా రోజులు అయినా, తన కోసం ఎవరూ రాలేదని, చెట్లు , పువ్వులు కి ప్రపంచం ఎప్పుడూ బాగుంటుంది అనట్టు..) ప్రకృతి కి పుట్టి…ప్రకృతి తో బ్రతికి.. ప్రకృతి లోనే ఊపిరి వదిలేస్తాడు.. రాబర్ట్. !

ఇంకా సినిమాలో, హృద్యమైన సన్నివేశాలు, పాత్రల కోసం నేను మాట్లాడలేదు! తను ఎదురు చూసే, కూతురు తన కోసం ఒకరోజు రాత్రి  వస్తే, అది కల, మాయో తెలియక అతను పడే బాధ వర్ణనాతీతం! 

చూసేయండి!  హాయిగా ఒంటరి తన్నాన్ని ఫీల్ అవ్వండి!

I’m rating the film with 4/5

5/5 - (3 votes)

The Life of Chuck (2025) – Prime Video

I will live my life until my life runs out. I am wonderful. I deserve to be wonderful

Says the lead character as a child to himself when he gets a chance to see his future. But will he live his future according to his will?

I hope you might have watched the film. If not,  watch it and come here to find the answers. (You might read it now and watch it later too but It’s full of spoilers)

1. Apocalypse and Grief

The movie starts with showing that California is sinking, Earth is shattered, there are bill boards everywhere ” 39 glorious years of Chuck” . ” Thank you, Chuck” . Everyone wonders, who is this person Chuck and how is the universe ending linked to CHUCK? Because, the universe falls apart , Bigbang shows up, yet the universe thanks CHUCK. Who is he?


You might wonder why characters in the first act , show weird confused expressions. The ending and final act sums up the multitudes.

The final stage of grief is acceptance and waiting for it.

2. I will my life until my life runs out yet I became an accountant

Chuck, played by Tom Hiddleston , who wanted to live his life to the fullest, becomes an accountant. He comes across a street drum player who brings the nostalgia of Chuck’s past. He wanted to be a dancer, but couldn’t somehow live up to the dreams. ( Family, Marriage might push him). The iconic dance sequence on the street comes as a surprise. It doesn’t only excite the viewers, but also the audience alike. He lived there for a moment. But he couldn’t stay there for more time.


3. Young Boy. Fresh love. New lessons and own world

He used to live with his grandparents in their victoria themed house. The house has its own secrets. Mark Hamil doesn’t want us to show any, until he gets drunk one night and says it all.

As a young boy, Chuck falls for an older girl in his dance class. Their chemistry is great but just like everything else this is temporary too.

Chuck’s real universe starts falling all at once, his close people start to leave, he becomes alone and decides to live his life to the fullest when he sees the vision of his future, lying on a hospital bed unconscious nearing death.

So, Chuck starts imagining things in his brain, creating a universe where everyone, everything falls apart when he leaves from earth.

The first act is imagination.

The second act is his life after adulthood.

The third act is his childhood which made him build the universe.


It’s one the saddest, tragic films which doesn’t get sadder at any level, yet shows the emotional depth in every act. The hope he had as a kid shattered. The Life he had as an adult ended. Even if you see your fate, you can’t change the way you end it.

I’m rating this film with 4/5

5/5 - (1 vote)

కాంత (2025) : మొదటి భాగం  సినిమా. రెండో భాగం  మిస్టరీ. అయినా, కష్టంగానే చూడాలి!

నాకు ఎదైన సినిమాలో, సినిమా ప్రపంచం పరిచయం చేసి, సినిమా కోసం మాట్లాడితే , ఎంతో ఆసక్తి గా చూస్తాను. అలానే, ” కాంత” ట్రైలర్ చూసి, సినిమా కోసం బాగా వెయిట్ చేసాను. దాదాపు ఒక్క నెల తర్వాత, థియేటర్ లో చూసిన సినిమా ఇది. (Oct 19, 2O25 తర్వాత, థియేటర్ లో చూసిన సినిమా ఇదే!)

సినిమాలో సినిమా!

తొలినాట సినిమా ప్రపంచం, తెర మీద కష్టం.. తెర వెనుక అహంకారం. ఇలా మొదటి భాగం అంతా, సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకుడు కి,  ఒక్క చక్కని సినిమా ప్రపంచం చూపించి బాగానే అలరించారు దుల్కర్, సముద్రఖని, భాగ్య శ్రీ! సినిమా అనే మాయ ప్రపంచం లో ఇన్ని కోణాలు ఉంటాయి అని, యంగ్ మైండ్స్ కి చూపించే ప్రయత్నం బాగుంది. ఈ సినిమా మొదటి భాగం చూసి, జీవితంలో ఏమి అవ్వాలో ఇంకా నిర్ణయం తీసుకోని వారు ఎవరైనా, ఆ ట్రాన్స్ లో దర్శకుడు లేదా కథానాయకుడు అవుదాం అనుకుంటారు. సినిమా మీద ఇష్టం ఉన్న వారు ఇంకాస్త ఎక్కువగా సినిమా ప్రపంచం మీద మక్కువ తెచ్చుకుంటారు. అంత బాగుంది మరి మొదటి భాగం!

రెండో భాగం కి ఏమైంది?

మొదటి భాగం చూసి , బాగానే సినిమా మాయలో పడిన ప్రేక్షకుడు కి, ఇంటర్వెల్ లో వచ్చే సన్నివేశం , రెండో భాగం వైపు ఆసక్తిగా ఎదురు చూసేలా చేస్తుంది. రెండో భాగం కూడా, సినిమా రాజకీయం ఉంటుంది అనుకునే వాడికి.. దర్శకుడు తియ్యనైన షాక్ తో, ఇంటరాగేషన్ అంటూ మొదలు పెడతారు. అక్కడ మొదలు అవుతుంది అస్సలు సమస్య! ఎన్ని సార్లు  తీసినా, మర్డర్ మిస్టరీ కోణం ఎప్పుడూ బాగానే ఉంటుంది. పైగా సినిమా సెట్లో మర్డర్ అంటే, ఇంకేం ఉంది? కానీ.. అక్కడ నుంచి సినిమా షిఫ్ట్ అయ్యిన తీరు. పాత్రలు చుట్టూ అల్లుకునే డ్రామా, ఏమాత్రం సంబంధం లేకుండా ఉంటాయి!

మొదటి గంట ఏమి చూసామో, చివరి గంట ఏమి చూస్తున్నామో, డిసైడ్ కాలేక , థియేటర్ కి వచ్చిన  ,ప్రేక్షకుడు నిరుత్సాహం పడటం కనిపించింది. రానా కి ఏమైంది? తన నటన మితి మీరి ఉండటంతో పాటు, ఓవర్ ది బోర్డు ఎమోషన్స్ తో కథని అక్కడ అక్కడే తిప్పుతూ, మొదటి భాగం ఇచ్చిన అనుభూతి నీ చెరిపేస్తారు .

చివరగా..

విడి విడిగా చూస్తే, సినిమా ప్రపంచం ఒక్క ఆలోచన. మర్డర్ మిస్టరీ ఒక్క ఆలోచన. సినిమా సెట్ లో మర్డర్ మిస్టరీ అనేది కొత్త ఆలోచనే! (అగస్టా క్రిస్టీ నవలలు ఆధారంగా వచ్చిన సినిమాలు లోనూ ఇలాంటి వింత మిస్టరీస్ ఉంటాయి). దర్శకుడి ఆలోచన కి సరిపోయే స్క్రీన్ ప్లే, సంభాషణలు లేకపోవడం, పాత్రలు నడిచే తీరు పేలవంగా ఉండటంలో, రెండో భాగం ఈ సినిమాని కిందకి నెట్టేశాయి అనే చెప్పాలి.

నాకు అయితే, ఈ సినిమాలో, నటి భాగ్య శ్రీ పాత్ర బాగా నచ్చింది. ఆమె నటన అమోఘం! దుల్కర్ గురించి తెలిసిందే. ఎలాంటి పాత్రనైనా ఇట్టే పట్టేస్తాడు. అది సినిమా హీరో పాత్ర ఐతే మరీను..

నాకు ఈ సినిమా మొదటి భాగం బాగా నచ్చింది. సినిమా ప్రపంచం, అక్కడి సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి.

నేను ఈ సినిమాకి 2.25/5 ఇస్తున్నాను!

4.9/5 - (14 votes)