సినిమా హీరో :
హీరో: తెర మీద ఎన్నో భావాలు పలికించే ఘనుడు. తన కోసం వచ్చిన వారిని, కొత్త ప్రపంచం లోకి తీసుకుని వెళ్ళగలిగే సిద్ధహస్తుడు. తన చుట్టూ కొత్త మాయ ప్రపంచం సృష్టించి, నిజ జీవితంలో ఇది అసాధ్యం అనుకునే వాటిని కూడా, ఇది ఎంత!. చాలా సింపుల్ అనిపించగలిగే వీరుడు.. సినిమా హీరో!
ప్రతి స్టార్, తన అభిమానులకి దేవుడిలాంటి వాడు. అలాగే, ప్రతి అభిమాని కూడా హీరోకి అంతే ముఖ్యుడు. అందుకే హీరోలు అభిమానులను సంతృప్తిపరచడానికి కష్టపడతారు. మంచి కథల కోసం ఎదురుచూస్తారు, మార్కెట్ విస్తరించడానికి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు.
అభిమాని :
అభిమాని అయితే? 9–5 ఉద్యోగం, నైట్ షిఫ్ట్ లు, కుటుంబ సమస్యలు, చదువు, సమాజపు ఒత్తిడులు… ఇలా.. ఎన్నో కష్టాలు ఎదుర్కొంటాడు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా, తను తన అభిమాన హీరో సినిమా చూడడానికి ఏమాత్రం వెనుకాడడు.. తన హీరో సినిమా విడుదలవుతోంది అంటే, మరింత ఉత్సాహంగా .. ఎదురు చూస్తాడు.
సినిమా విడుదలైన రోజు రాగానే, కొందరు లీవ్ పెట్టేస్తారు, కొందరు కాలేజీలు బంక్ చేస్తారు, పెళ్లి ఫంక్షన్ నుంచి కూడా థియేటర్‌కి వచ్చే అభిమానులు ఉన్నారు! ఇలాంటి అమాయకమైన అభిమానులు దొరకడం ఏ హీరో కైనా నిజమైన వరం.
బాహుబలి తరువాత తెలుగు సినిమా:
బాహుబలి.. పాన్ ఇండియన్ మార్కెట్ ని క్రాక్ చేసి కొత్త ట్రెండ్ సృష్టించింది. నిర్మాతలు, దర్శకులు.. హీరోలు హీరోయిన్లు ఆర్టిస్టులంతా.. పెద్ద స్థాయిలో సినిమాలు చేసి, ప్రేక్షకులకు కొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి కష్టపడుతున్నారు.
దాంతోపాటు పెట్టుబడి కూడా పెరుగుతూ వస్తోంది.
అమ్మేవారు – కొనేవారు సమస్య:
సినిమా సిద్ధమైంది. కొనేవాళ్లు రెడీగా ఉన్నారు. కానీ అసలు సమస్య మొదలయ్యేది టికెట్ ధరల విషయంలోనే..
నిర్మాతలు ఎక్కువ రేట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్ముతారు. తర్వాత వారిని లాభాల్లో ఉంచడానికి ప్రభుత్వాలని సంప్రదించి టికెట్ ధరలు పెంచుకుంటారు.
ప్రభుత్వం మరియు టికెట్ ధరలు:
ప్రభుత్వం ఎందుకు అంగీకరిస్తుంది?
ఎందుకంటే టికెట్ మీద 18% entertainment tax వస్తుంది. రెవెన్యూ పెరుగుతుంది అనే ఉద్దేశంలో, స్పెషల్ రూల్స్ పెట్టి ధరలు పెంచడానికి అనుమతి ఇస్తుంది.
అభిమాని మరియు పెరిగిన టికెట్ ధర:
బాహుబలి రాకముందు రోజులలో బ్లాక్ టికెటింగ్ పెద్ద ఎత్తున ఉండేది. మొదటి షోలు కోసం అభిమానులు ఎక్కువ ధరలకు బ్లాక్‌లో టికెట్లు కొనేవారు.. ఎలాగైనా సినిమా మొదటి రోజు చూడాలి అంటే, ఎన్నో రిఫరెన్సులు, మరెన్నో తలనొప్పులు! ఇవేమీ లేని వారు, డైరెక్ట్ థియేటర్ దగ్గరకు 1500-2000rs. తీసుకుని వెళ్తే, టికెట్ దొరికే ఛాన్స్ ఉండేది!
కానీ.. ఇప్పుడు..
ప్రభుత్వాల ద్వారా ప్రత్యేక షోలుకి అనుమతి రావడంతో ప్రతి ధియేటర్లోని స్పెషల్ షోలు వేస్తున్నారు.
Online టికెటింగ్ ఉండటంతో.. స్పెషల్ షోలకు టికెట్లు , అందరికీ దొరుకుతున్నాయి . దీని ద్వారా ఎవరికైనా టికెట్ తీసుకునే అవకాశం ఉంది. ఆ దృష్ట్యా ఇది పాజిటివ్.
అయితే .. అభిమానులు నిజంగా ఇంత ధర చెల్లించి సినిమా చూడాలా?
చివరి మాట:
👉 అభిమానికి: నువ్వు నిజంగా, నీ అభిమాన హీరో సినిమా మొదటి ఆట చూడాలి అనుకుంటే, పెరిగిన ధర తో సినిమా చూడు. కానీ, తరువాత కంప్లైంట్ చెయ్యకు!
👉 తెర మీద కనిపించే హీరోలు కు:
అప్పుడప్పుడైనా, కథ పరమైన చిన్న సినిమాలు చెయ్యండి! ఈ మధ్య వచ్చిన..” లిటిల్ హార్ట్స్ ” ఎంత ప్రభంజనం సృష్టించిందో చూసే ఉంటారు! ఈ పాన్ ఇండియా మాయ లో, మేము అభిమానిగా మారిన హీరోని మిస్ అవుతున్నాము.! స్కేల్ పెంచితేనే ఇబ్బంది. స్కేల్ పెరగనంత వరకు, ఏ నిర్మాత అయినా, డిస్ట్రిబ్యూటర్ అయినా, అభిమాని అయినా, హీరో అయినా కలెక్షన్స్ గొడవ లేకుండా హాయిగా ఉంటాడు.
👉 నిర్మాతలకు: అభిమానులు చెల్లిస్తున్న డబ్బుకి గౌరవిస్తూ మంచి క్వాలిటీ కంటెంట్ ఉన్న సినిమాలు తియ్యండి…. టికెట్ ధర పెంచే ముందు కనీసం ఫ్యాన్ గ్రూప్స్ అభిప్రాయం అడగండి. టికెట్ ధర, సినిమా లాంగ్ రన్ ను చంపేస్తుంటే, exhibitors లెటర్స్ రాయాల్సిన పరిస్థితి వస్తోంది!
ఇప్పుడు కళ్ళు తెరవకపోతే, రేపు “OTTల వలన థియేటర్స్ ఖాళీ” అని చెప్పే పరిస్థితి వస్తుంది. (ఆల్రెడీ, వచ్చేసింది కూడా!)
ఈ ట్రెండ్ ను సరైన విధంగా నియంత్రించకపోతే, అభిమానులు హీరోపై ఆసక్తి కోల్పోతారు… హీరో అభిమానిని కోల్పోతాడు.
ఈ ఆర్టికల్ పై మీ అభిప్రాయాన్ని కిందన కామెంట్ రూపంలో తెలియజేయండి… ఈ ఆర్టికల్ కి మీరు రేటింగ్ కూడా ఇవ్వచ్చు